ఎమ్మిగనూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో

0
237

చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు.. ప్రజా విశ్వాసానికి తూట్లు పొడిచిన కూటమి ప్రభుత్వానికి ఎమ్మిగనూరులో ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి భారీ బహిరంగ ర్యాలీ లో మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కి, రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి నిరసనగా "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు.చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు – ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు", "ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు డౌన్ డౌన్", "మెగా డీఎస్సీ కాదు… దగా డీఎస్సీ", "నిత్యావసర ధరలు పెంచిన ప్రభుత్వం డౌన్ డౌన్", "ప్రశ్నిస్తానన్న పవన్ ఎక్కడ?", "ఇంటింటికి బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం సిగ్గుపడాలి", "ఇసుకాసురుడు చంద్రబాబు", "కళ్యాణలక్ష్మి – షాదీ తోఫా ఎక్కడ?", "నిరుద్యోగ భృతి ఎక్కడ?", "ఇంటింటికో ఉద్యోగం ఏమైంది?", "ప్రతి మహిళకు రూ.15 వేల హామీ ఏమైంది?", "రైతులకు గిట్టుబాటు ధరలు ఎక్కడ?" అంటూ నినాదాలతో పట్టణాన్ని హోరెత్తించారు.అనంతరం జరిగిన సభలో ఎర్రకోట రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో "బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ" పేరుతో ఇంటింటికీ బాండ్లు పంచి, సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయకుండా రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.ప్రతి వర్గాన్నీ మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కూటమి ప్రభుత్వమేనని అన్నారు.నిత్యావసర వస్తువులు, విద్యుత్, ఇంధన ధరలను అమాంతం పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచారని, ప్రతి కుటుంబంపై తీవ్ర ఆర్థిక భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులకు ఎరువుల ధరలు పెంచి, కనీస గిట్టుబాటు ధరలు కల్పించకుండా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారని అన్నారు.జూన్ నెల వచ్చినా ఈ-క్రాప్ నమోదు పూర్తి చేసి పెట్టుబడి సాయం అందించాల్సిన ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, బూట్లు అందించలేని దుస్థితి నెలకొందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పూర్తిగా విఫలము అయ్యారు అని పేర్కొన్నారు.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒక్క సంక్షేమ పథకం ఆపకుండా ప్రతి కుటుంబానికి అండగా నిలిచారని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి సంక్షేమ పాలనకు నిదర్శనంగా నిలిచారని గుర్తు చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, గంజాయి, మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి రావడంతో యువత తప్పుదోవ పడుతోందని, చట్టవ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని విమర్శించారు.వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో కక్షసాధింపు రాజకీయాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, నిరుద్యోగులను నిరాశలోకి నెట్టారని, అక్రమ ఇసుక దందా, అక్రమ మద్యం, బెల్టు షాపులు రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ అండదండలతో సాగుతున్నాయని ఆరోపించారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి అర్హ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయని, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకుల కుటుంబాలకు కూడా లబ్ధి చేకూరిందని పేర్కొంటూ, వారికి చిత్తశుద్ధి ఉంటే నిజం ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు.గత వైఎస్సార్‌సీపీ సంక్షేమ పాలనకు, ప్రస్తుత కూటమి పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు ఎర్రకోట రాజీవ్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
New rules of Ration card.
కొత్త రేషన్ కార్డ్ నిబంధనలు 2026 కొత్త నిబంధనలు - ముఖ్యాంశాలు   కేంద్ర ప్రభుత్వం ప్రధాన్...
By G k Nookala 2026-03-05 10:34:37 0 187
Bharat Aawaz
The Curious Scientist & the Whispering Plant: A Floral Mystery from the Amazon Jungle “When the jungle speaks, the flowers hide.”
In the heart of the vast Amazon rainforest, a curious discovery has stunned botanists and...
By Bharat Aawaz 2025-08-04 18:35:34 0 1K
Andhra Pradesh
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ, బాగుపడిన పాఠశాల ఆవరణ
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ, బాగుపడిన పాఠశాల ఆవరణ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారి...
By Chennaiah Kati 2026-07-17 08:01:52 0 93
SURAKSHA
Ashok Barnwal: Steering Madhya Pradesh with Vision
From a distinguished 1991-batch IAS officer to Acting Chief Secretary of Madhya Pradesh, Ashok...
By Lokeshwari Panthadi 2026-07-23 05:05:17 0 133
Andhra Pradesh
పాలెంకొండలో మహిళపై దాయాదుల దాడి.. కేసు నమోదు.
మదనపల్లె మండలం పాలెంకొండ గ్రామంలో గురువారం ప్రేమకుమారి అనే మహిళపై దాయాదులు మూకుమ్మడిగా దాడి...
By Pagadala Venkateswar 2026-06-19 04:43:33 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com