మంచిర్యాల జిల్లా కేంద్ర లైబ్రరీలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చర్యలు

0
179

మంచిర్యాల జిల్లా : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గత పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్ర లైబ్రరీని సందర్శించిన సందర్భంగా అక్కడ చదువుతున్న విద్యార్థులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థుల ఇబ్బందులను సానుకూలంగా స్పందించిన ఎంపీ, వెంటనే వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ని ఆదేశించారు,దీనిలో భాగంగా విద్యార్థులకు అవసరమైన వాష్‌రూమ్‌లు మరియు తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేయగా, ఈరోజు వాటి పనితీరును సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు,ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు కష్టపడి చదివి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. అలాగే మంచిర్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు, అదేవిధంగా పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ లో పోస్టులను పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి కృషి చేస్తానని తెలిపారు,విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Telangana
సామాన్యుని కాంతిరేఖలా, "మీట్ యువర్ సి.పి. సజ్జనర్.|
హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో అధికారి అంటే పాలకుడు కాదు, సేవకుడు. అని నిరూపిస్తున్నారు హైదరాబాద్...
By Sidhu Maroju 2026-02-06 20:23:08 0 234
Andhra Pradesh
భార్య విడాకుల కేసు.. మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం.
మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీ గంగన్నగారిపల్లెకు చెందిన శివకుమార్ (35) కుటుంబ సమస్యలతో తీవ్ర...
By Pagadala Venkateswar 2026-06-27 05:51:37 0 94
Andhra Pradesh
Renew global energy inauguration
రీన్యూ ఎనర్జీ గ్లోబల్ (ReNew) సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల పెట్టుబడితో...
By G k Nookala 2026-04-23 04:58:38 0 186
Andhra Pradesh
ఢిల్లీ, అస్సాం పర్యటనకు సీఎం చంద్రబాబు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ, అస్సాం వెళ్లనున్న సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీలో కేంద్ర...
By Pagadala Venkateswar 2026-05-11 06:30:12 0 132
Andhra Pradesh
Arava Sridhar: ‘రాజకీయం చేయొద్దు.. పవన్ పేరు చెడగొట్టొద్దు’: అరవ శ్రీధర్ కేసులో మరో వీడియో విడుదల చేసిన మహిళా ఉద్యోగి.
తన సెల్‌ఫోన్‌తో పాటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సెల్‌ఫోన్‌ను పరిశీలిస్తే వాస్తవాలు...
By Pagadala Venkateswar 2026-02-03 06:43:26 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com