ఎమ్మిగనూరు సర్కిల్ నందు DSF ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది

0
209

ఎమ్మిగనూరు సర్కిల్ నందు ధర్నా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ.దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ (NEET) పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీలు విద్యా వ్యవస్థపై తీవ్ర అనుమానాలను కలిగించాయి. జాతీయ పరీక్షా సంస్థ (NTA) నిర్వహణలో జరిగిన వైఫల్యాల కారణంగా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర, పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిని చట్టపరంగా శిక్షించాలి.ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి . విద్యార్థుల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి.విద్యను వ్యాపారంగా కాకుండా విద్యార్థుల హక్కుగా గుర్తించి, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాము. రానున్న రోజుల్లో భారీ ఎత్తున డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతాం.ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ అనిల్ వర్మ కిరణ్ రాజు అరవింద్ వీరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉక్కు కార్మికులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే: లోకేశ్
విశాఖ ఉక్కు కార్మికులకు YS జగన్ క్షమాపణ చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు. 'స్టీల్ ప్లాంటును...
By Boiena Rajesh 2026-06-10 09:48:15 0 222
Andhra Pradesh
ఆరు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు.
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ ఫేజ్ శంకుస్థాపనతో పశ్చిమ ప్రజలకు ట్రాఫిక్ భారంనుండి విముక్తి :...
By John Baji 2026-01-04 04:02:10 0 254
Telangana
మంచిర్యాల్: దుమ్ము లేపిన బోనాల జాతర
యూట్యూబ్ కళాకారులు బుధవారం హమాలివాడలో బోనాల జాతర నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి...
By Bonagiri RaviShankar 2026-07-22 15:28:02 0 207
Andhra Pradesh
చీరాల క్లాక్ టవర్ సెంటర్ లో శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల...
చీరాల: ఇతర పార్టీలు బీసీలను కరివేపాకుల మాదిరి తీసేస్తే వారిని తులసి దళాలుగా మార్చిన ఘనత టిడిపి...
By Gadiyapudi Narendra 2026-01-23 16:11:35 0 257
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాని కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి తరలింపు
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి తరలించడంతో, ఆదివారం సాయంత్రం కలెక్టరేట్...
By Pagadala Venkateswar 2026-01-05 07:53:21 0 281
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com