ద్రోణి ప్రభావం: నేడు ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు.

0
121

 

 

ద్రోణి ప్రభావం: నేడు ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు

11-06-2026 Thu 

Andhra

Andhra Pradesh Rains Expected Today Due to Trough Effect

రాయలసీమ, మార్కాపురం ప్రాంతాల్లో మోస్తరు వర్షాల అంచనా

విశాఖలో ఈదురుగాలులకు నష్టం.. విరిగిన చెట్లు, కరెంట్ స్తంభాలు

అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల సంస్థ

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది.

 

ఈ మేరకు ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాలు వెల్లడించారు. మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించారు.

 

కాగా, బుధవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5 మిల్లీమీటర్లు, లావేరులో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు, అనకాపల్లి జిల్లా మకవరపాలెం, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో గరిష్ఠంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.

 

విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో బుధవారం సాయంత్రం వీచిన ఈదురుగాలుల వల్ల పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, వర్ష సూచన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు, బలమైన గాలుల పట్ల తగిన జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచించారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న _ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే రామాంజనేయులు.
గుంటూరు,చేబ్రోలు హనుమయ్య కంపెనీ గ్రౌండ్ నందు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ శ్రీ మన్నవ మోహన్...
By John Baji 2026-01-22 11:13:40 0 262
Andhra Pradesh
నేడు శంబర పోలమాంబ చివరి వారం జాతర
ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత, రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన శంబర పోలమాంబ అమ్మవారి జాతర...
By Boiena Rajesh 2026-03-31 07:55:08 0 246
Andhra Pradesh
ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త భూమా గోవిందరెడ్డి గారి ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లడం జరిగింది
ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త భూమా గోవిందరెడ్డి గారి ఆహ్వానం మేరకు...
By Chennaiah Kati 2026-07-03 09:57:11 0 91
Telangana
అలిండియా అంబేద్కర్ యువజన సంఘం
అలిండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కమ్మదనం నర్సింహులు, ఏర్పుల దయాకర్...
By Veeresh Kumar 2026-03-26 13:27:04 0 445
Telangana
మంచినీరు, డ్రైనేజ్ సమస్యలపై హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ మేనేజర్ కి వినతిపత్రం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం హెచ్ ఏ ఎల్, ఇతరి కాలనీలకు...
By Sidhu Maroju 2025-12-29 16:35:15 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com