వృద్ధి రేటు పెంపుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. పనితీరు ఆధారంగా శాఖలకు స్కోరింగ్.

0
102

 

వృద్ధి రేటు పెంపుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. పనితీరు ఆధారంగా శాఖలకు స్కోరింగ్

 

Andhra

Chandrababu Naidu focuses on growth rate and department scoring based on performance

వివిధ శాఖలకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు నిర్దేశించిన సీఎం

పనితీరు ఆధారంగా స్కోరింగ్ విధానం అమలుకు నిర్ణయం

ప్రతి నెలా 12వ తేదీన ఆర్థిక నివేదికల రూపకల్పన

ఆర్ధిక వ్యవహారాల పర్యవేక్షణకు ఏఐ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై ఆలోచన

2047 స్వర్ణాంధ్ర లక్ష్య సాధన కోసం డేటా ఆధారిత పాలనపై దృష్టి

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు, వృద్ధి రేటును పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాచరణ ప్రారంభించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) లక్ష్యాలు, ప్రభుత్వ శాఖల పనితీరును కొలిచే కీ-పెర్ఫార్మెన్సు ఇండికేటర్ల (కేపీఐ)పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ, రవాణా, పర్యాటక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వివిధ శాఖలకు కేపీఐలను సీఎం నిర్దేశించారు. జాతీయ సగటు కంటే వెనుకబడిన సూచికలను మెరుగుపరచడమే కాకుండా, అగ్రశ్రేణి రాష్ట్రాలతో సమానంగా లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టం చేశారు. కేవలం నిర్దేశిత లక్ష్యాలే కాకుండా, వాస్తవ వృద్ధి (రియల్ గ్రోత్) ఆధారంగా శాఖల పనితీరును అంచనా వేసేందుకు స్కోరింగ్ విధానాన్ని అమలు చేయాలని సీఎం నిర్ణయించారు.

 

రాష్ట్ర, క్షేత్రస్థాయి ఆర్థిక స్థితిగతులను ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు ప్రతి నెలా 12వ తేదీన ఆర్థిక నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాలపై పెట్టే వ్యయం, ఆర్థిక కార్యకలాపాలను 3.5 రెట్లు పెంచేలా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఆర్థిక వ్యవహారాలను రియల్ టైంలో పర్యవేక్షించేందుకు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాలనే ఆలోచనను కూడా పంచుకున్నారు.

 

2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా డేటా ఆధారిత పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్‌పోర్టుల వంటి కీలక ప్రాజెక్టులతో ఆర్థిక వ్యవస్థకు 'మల్టిప్లైయర్ ఎఫెక్ట్' తీసుకురావాలని సూచించారు. కేపీఐలు మెరుగ్గా ఉంటేనే రాష్ట్ర వృద్ధి రేటు పెరుగుతుందని, ప్రతి రంగంలోనూ గ్రాస్ వాల్యూ అడిషన్ (జీవీఏ) పెంపుపై శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ పోరాటం.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్...
By Pagadala Venkateswar 2026-05-22 05:00:22 0 108
Andhra Pradesh
యోగాంధ్ర-2026: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రిజిస్ట్రేషన్.. సీఎం సమీక్షలో కీలక ఆదేశాలు.
  యోగాంధ్ర-2026: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రిజిస్ట్రేషన్.. సీఎం సమీక్షలో కీలక ఆదేశాలు...
By Pagadala Venkateswar 2026-06-18 05:16:26 0 104
Telangana
Police stop Armur mla Rakesh Reddy sent to Kamareddy mla office
ఆర్మూర్ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలింపు...
By G k Nookala 2026-06-29 06:32:36 0 268
Telangana
"వారాసిగూడలో నకిలీ డాక్టర్ గుట్టురట్టు!"
సికింద్రాబాద్ : వారాసిగూడలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ వైద్యుడి గుట్టును సిటీ...
By Sidhu Maroju 2026-05-17 06:53:29 0 248
Bihar
Deadly Fire Ravages Private Hospital ICU in Muzaffarpur
A devastating fire broke out in the Intensive Care Unit (ICU) of Prasad Hospital in the Brahmpura...
By Hazu MD. 2026-06-04 05:17:51 0 513
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com