హైదరాబాద్లో రగ్బీ ప్రీమియర్ లీగ్ జెర్సీ ఆవిష్కరించిన క్రీడాశాఖ మంత్రి : శ్రీహరి

0
265

హైదరాబాద్ : రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్‌పిఎల్) ప్రారంభోత్సవానికి విచ్చేయవలసిందిగా రగ్బీ ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు మినిస్టర్ క్వార్టర్స్ లోరాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీహరి ఆర్ పి ఎల్ జెర్సీ ని ఆవిష్కరించారు. జిఎంఆర్ స్పోర్ట్స్ ,రగ్బీ ఇండియా తరపున 16 జూన్ 2026న హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జి.ఎం.సి. బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ప్రారంభం కానుందని తెలిపారు,సీజన్ 2లో 10 జట్లు (6 పురుషుల ఫ్రాంచైజీలు మరియు 4 మహిళల జట్లు) పాల్గొంటాయి, ఇవి 48 మ్యాచ్‌లలో పోటీపడతాయని ఇందులో 19 దేశాల నుండి 70 మందికి పైగా అంతర్జాతీయ రగ్బీ సెవెన్స్ ఆటగాళ్లతో పాటు భారతదేశంలోని అగ్రశ్రేణి రగ్బీ ప్రతిభావంతులు కూడా పాల్గొంటారని తెలిపారు భారతదేశపు ప్రధాన ఫ్రాంచైజీ ఆధారిత రగ్బీ పోటీగా, ఈ లీగ్ క్రీడను అభివృద్ధి చేయడంలో భారత దేశం యొక్క విస్తృత క్రీడా, ఒలింపిక్ ఆశయాలకు మద్దతు ఇవ్వడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగన్నారు, తెలంగాణ క్రీడా శాఖ క్రీడలను ప్రోత్సహించడంలో వివిధ క్రీడాంశాలలో లీగ్ పోటీలకు సహకారం అందజేస్తుందని తెలిపారు,ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోనీ బాలా దేవి, ఆర్ పి ఎల్ నిర్వాహకులు రగ్బీ ఇండియా ప్రెసిడెంట్ రాహుల్ బోస్ పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: అనుమానాస్పద వ్యక్తులు ఉంటే సమాచారం ఇవ్వండి: ఎస్సై
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం బయలు గాని పల్లి గ్రామంలో గురువారం సాయంత్రం గ్రామ ప్రజలకు సైబర్...
By Kothuru Murali 2026-04-16 17:31:17 0 162
Telangana
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా, మల్కాజిగిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి...
By Sidhu Maroju 2025-07-06 17:38:56 0 1K
Andhra Pradesh
TTD Chairman BR Naidu: టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రకటన... పూర్తి వివరాలు.
TTD Chairman BR Naidu: టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రకటన... పూర్తి వివరాలు ఇవిగో! 28-02-2026 Sat...
By Pagadala Venkateswar 2026-02-28 12:43:27 0 204
Andhra Pradesh
బొబ్బిలి మార్కెట్లో ట్రాఫిక్ జామ్
బొబ్బిలి మార్కెట్లో బుధవారం ట్రాఫిక్ జామ్ అయింది. శ్రావణ శుక్రవారం పూజ సామాగ్రి కొనుగోలు...
By Boiena Rajesh 2026-08-19 13:09:46 0 103
Andhra Pradesh
చీరాలలో దివ్యాంగుల గర్జన * సొంత ఇళ్లు కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం
చీరాల పట్టణంలోని ఎన్.ఆర్.పి.ఎం హైస్కూల్ ఆవరణలో గల ఓపెన్ ఎయిర్ థియేటర్ లో దివ్యాంగుల పోరాట సమితి...
By Vadlamudi NagaVenkat 2026-03-07 16:54:31 0 562
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com