"పెండింగ్ సమస్యల పరిష్కారానికి డీసీని కలిసిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
273

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. 

ప్రేమ్, సాజిద్, లింగారెడ్డి, మహేందర్, రాజేందర్‌లతో కలిసి డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్‌ కు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

కొత్త చెరువు కట్ట నుంచి సెలెక్ట్ థియేటర్ వైపు వెళ్లే రహదారి, అలాగే నాగిరెడ్డి కాలనీ సమీపంలోని ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిన్నందున వాటిని అత్యవసరంగా మరమ్మతులు చేయాలని కోరారు. అదేవిధంగా లోయోలా కళాశాల సమీపంలో, రాజీవ్ వీకర్ సెక్షన్ ప్రాంతంలో వీధి దీపాలు పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎంఈఎస్ కాలనీలో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, మురుగునీటి పారుదల మరియు చెత్త తొలగింపు పనులను వేగవంతం చేయాలని డీసీ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అధికారులను కోరగా, వినతిపత్రంలో పేర్కొన్న అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
SURAKSHA
డిజిటల్ పౌరులుగా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం మన కర్తవ్యం
డిజిటల్ ప్రపంచం అపారమైన అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ, అది బాధ్యతలతో కూడినదని గుర్తుంచుకోవాలి....
By Kalaga Sailaja 2026-06-24 09:29:46 0 113
Telangana
కాట్రియాల-పర్వతపూర్ రోడ్డు కంకరమయం
రామాయంపేట మండలం కాట్రియాల గ్రామం నుంచి పర్వతాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా...
By Katiyala JeevanRaj 2026-03-14 10:00:20 0 574
Telangana
సంక్రాంతి శోభ - ముగ్గుల ప్రభ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ప్రజా పాలనలో మహిళలకు పెద్దపీట వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...
By Sidhu Maroju 2026-01-12 10:07:54 0 273
Andhra Pradesh
మదనపల్లి లో పరేడ్ రిహార్సల్స్ – పర్యవేక్షించిన అధికారులు.
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం బీటీ కళాశాల మైదానం సిద్ధమవుతోంది. ఈసారి గణతంత్ర...
By Pagadala Venkateswar 2026-01-25 06:46:04 0 196
Andhra Pradesh
సదుం పోలీస్ స్టేషన్ పరిశీలించిన డిఐజి కోయ ప్రవీణ్ణ్
ఆదివారం, పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుం పోలీస్ స్టేషన్‌ను కర్నూల్ డిఐజి కోయ ప్రవీణ్...
By Kothuru Murali 2026-01-04 10:51:27 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com