విజయవాడ ను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుదాం

0
353

*ప్రెస్ నోట్*

 

*6-6-26*

 

*విజయవాడను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతాం*

 

 

*“విజయవాడలో క్రీడల అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తాం!”*

 

*“ఆధునికరణతో ఇండోర్ స్టేడియంను రాష్ట్రంలోనే ఆదర్శ క్రీడా వేదికగా మారుస్తాం”*

 

― *విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని)*

 

విజయవాడ(పటమట చెన్నుపాటి రామ కోటయ్య స్టేడియం)

భవిష్యత్తులో విజయవాడను రాష్ట్రంలోనే ప్రముఖ **“స్పోర్ట్స్ సిటీ”**గా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ స్పష్టం చేశారు. క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.“విజయవాడ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదనీ క్రీడల్లోనూ విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం అనీ యువత కలలను సాకారం చేసే స్పోర్ట్స్ హబ్‌గా విజయవాడను తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నాను” అని ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) స్పష్టం చేశారు.

 

శనివారం విజయవాడ లోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2026 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ, క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత వ్యక్తిత్వ వికాసంలో క్రీడల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విజయవాడలోని యువ క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించేందుకు అత్యుత్తమ క్రీడా వసతులు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించినట్లు తెలిపారు.

 

“పీవీ సింధు స్థాయి క్రీడాకారులు మాత్రమే కాదనీ ఆమె స్పూర్తితో మన గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రపంచ వేదికలపై భారత జెండాను రెపరెపలాడించే ప్రతిభావంతులు వెలుగులోకి రావాలన్నారు. వారికి కావాల్సిన వేదికలు, శిక్షణా సదుపాయాలు, ప్రోత్సాహం అందించడం మన బాధ్యత” అని ఎంపీ పిలుపునిచ్చారు.

బ్యాడ్మింటన్ రంగంలో చేతన్ ఆనంద్, పీ.వి.వి. లక్ష్మి, రుత్వికా శివాని, మేఘనా జక్కంపూడి, సూర్య చరిష్మ వంటి ప్రతిభావంతులను అందించిన విజయవాడ, రాబోయే రోజుల్లో మరింత మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను దేశానికి అందించే కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు.

 

ఇండోర్ స్టేడియాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసి, క్రీడాకారులు అత్యుత్తమ వాతావరణంలో సాధన చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రీడలకు సంబంధించిన మౌలిక వసతుల విస్తరణ, శిక్షణా సదుపాయాల మెరుగుదల, యువ ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

 

క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఎంపీ స్వయంగా బ్యాడ్మింటన్ ఆడి వారిని అభినందించారు. పోటీల నిర్వహణలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, క్రీడాకారులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఆ పాఠశాల ప్రవేశానికి ఈ నెల 12 వరకు గడువు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎంజేపీ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 12...
By Kothuru Murali 2026-03-06 11:30:24 0 169
SURAKSHA
Telangana Police: A Steadfast Commitment to Service, Safety, and Humanity
The Telangana Police transcends the traditional role of maintaining law and order, acting as a...
By Kalaga Sailaja 2026-06-24 05:13:31 0 145
Andhra Pradesh
ప్రజలకు వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా చూస్తాం గద్దె రామ్మోహన్ గారు
*ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చూస్తాం* *14వ డివిజన్‌లో చేపల వంతెన దగ్గర పర్యటించిన...
By Rajini Kumari 2026-05-08 13:39:09 0 163
Telangana
సుభాష్ నగర్ UPHC కి సొంత భవనం ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే కి వినతి .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సుభాష్‌నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC) నిర్వహణ కోసం...
By Sidhu Maroju 2026-03-13 10:07:53 0 200
Andhra Pradesh
మదనపల్లెలో బైక్ రేసర్ల వీరవిహారం: బాలుడికి తీవ్ర గాయాలు
మదనపల్లెలో సైలెన్సర్లు తొలగించి అతివేగంగా బైకులు నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న...
By Pagadala Venkateswar 2026-04-05 04:54:06 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com