ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి... రూ.8 కోట్లకు పైగా ఆస్తులు!

0
221

 

ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి... రూ.8 కోట్లకు పైగా ఆస్తులు!

06-06-2026 Sat 06:20

Andhra

Kakinada Collectorate employee in ACB trap assets worth over 8 crores

కాకినాడ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ శివకుమార్‌పై ఏసీబీ దాడులు

ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏకకాలంలో సోదాలు

రూ.8 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించినట్లు ప్రాథమిక సమాచారం

కాకినాడ, హైదరాబాద్‌లలో ఫ్లాట్లు, విలాసవంతమైన కార్లు, బంగారం స్వాధీనం

బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారుల తనిఖీలు

కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న చోడపురెడ్డి శివరామ్ కుమార్ (36) నివాసం, ఆయన బంధువుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం ఏకకాలంలో పలుచోట్ల సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కోట్లాది రూపాయల విలువైన అక్రమాస్తులు వెలుగుచూసినట్లు ప్రాథమికంగా వెల్లడైంది.

 

రాజమహేంద్రవరం రేంజ్ ఏసీబీ అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో ఈ దాడులు జరిగాయి. కాకినాడలోని శివకుమార్ నివాసం, ఆయన మామ చింతల శ్రీనివాసన్ ఇల్లు, చీడిగలోని సోదరి నాగిష్ సుష్మ ఫ్లాట్‌తో పాటు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులపై అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. వీటితో పాటు కాకినాడ కలెక్టరేట్ ప్రాంగణంలోని ఆయన కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు.

 

ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో సుమారు రూ.8 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. వీటిలో మూడు విలాసవంతమైన కార్లు, కాకినాడ, హైదరాబాద్‌ నగరాల్లో సుమారు రూ.4 కోట్ల విలువైన మూడు ఫ్లాట్లు, 700 గ్రాముల బంగారం, పలుచోట్ల ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను అధికారులు కనుగొన్నారు.

 

శివకుమార్ సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూనే, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా, కలెక్టరేట్ రికార్డ్ రూమ్ ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగించారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల పూర్తి విలువ, ఇతర వివరాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.           

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu: నేడు నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.
Andhra   CM Chandrababu Naidu Tours Nandyala District Today డోన్ నియోజకవర్గంలో రైతులకు...
By Pagadala Venkateswar 2026-03-09 06:08:38 0 190
Telangana
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడండి
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరుతూ ఉప...
By Ponnala Srinivasrao 2026-03-26 05:06:44 0 237
Arunachal Pradesh
NH-13 and NH-713A Blocked; Sagalee Issues Advisory
Following massive overnight landslides, the Additional District Magistrate of Sagalee has issued...
By Lokeshwari Panthadi 2026-06-27 04:27:18 0 94
Telangana
నిజామాబాద్
పార్లమెంట్ పరిధిలోని వివిధ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు ఈ రోజు నన్ను కలువడం జరిగింది.ఈ సందర్భంగా...
By Sadaq Sadaq 2026-05-18 09:02:28 0 130
Andhra Pradesh
పుంగనూరు: స్టార్టర్ మరమ్మతులు చేస్తూ రైతు మృతి
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, ఏడూరు గ్రామంలో బుధవారం వ్యవసాయ పొలంలో బోరు బావి స్టార్టర్...
By Kothuru Murali 2026-04-29 11:29:14 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com