తిరుమల శ్రీవారి దర్శనం.. ఇక ఎన్ఆర్ఐలకు 3 నెలల వరకు అవకాశం.

0
136

 

తిరుమల శ్రీవారి దర్శనం.. ఇక ఎన్ఆర్ఐలకు 3 నెలల వరకు అవకాశం

06-06-2026 Sat 08:40

Andhra

TTD Tirumala Srivari Darshan NRI opportunity extended to 3 months

ఎన్ఆర్ఐ భక్తులకు శ్రీవారి దర్శన గడువు 90 రోజులకు పెంపు

భారత్‌కు వచ్చిన 3 నెలల లోపు దర్శించుకునేందుకు అవకాశం

శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి విశేష స్పందన

రూ. లక్ష విరాళం ఇస్తే ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శన సౌకర్యం

దాతల కోసం తిరుమలలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఆశించే విదేశాల్లోని ఎన్ఆర్ఐలకు టీటీడీ ఒక శుభవార్త చెప్పింది. ఎన్ఆర్ఐ భక్తులు సుపథం మార్గంలో పొందే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఉన్న గడువును 30 రోజుల నుంచి ఏకంగా 90 రోజులకు (3 నెలలు) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుతో విదేశాల నుంచి వచ్చే భక్తులు మరింత సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలు కలుగుతుంది.

 

ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం ఎన్ఆర్ఐలు భారత్‌కు వచ్చిన 30 రోజుల్లోపే తమ ఒరిజినల్ పాస్‌పోర్ట్, జిరాక్స్ కాపీలతో తిరుమలలోని సుపథం వద్దకు వెళ్లి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ పొందాల్సి ఉండేది. ఈ తక్కువ గడువు కారణంగా చాలామంది భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గడువును పెంచాలని కొంతకాలంగా వస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకున్న టీటీడీ, ఈ పరిమితిని మూడు నెలలకు పెంచింది. దీంతో ఎన్ఆర్ఐలు తమ ప్రయాణ ప్రణాళికలకు అనుగుణంగా మరింత వెసులుబాటుతో శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు.

 

ఆపన్న హృదయ పథకానికి విశేష స్పందన

మరోవైపు టీటీడీ అమలు చేస్తున్న శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి దాతల నుంచి మంచి స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు. ఈ పథకం కింద టీటీడీ ఆపన్న హృదయ ట్రస్టుకు రూ. లక్ష విరాళంగా అందించిన దాతలకు, వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే భక్తులు, దర్శనానికి ఒకరోజు ముందుగా తిరుమలలోని దాతల విభాగంలో విరాళం చెల్లించాల్సి ఉంటుంది.

 

విరాళం చెల్లించిన తర్వాత వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కోసం ఒక్కొక్కరికి రూ.500 చొప్పున మొత్తం రూ.2,500 చెల్లించాలి. ఆ ఐదుగురు భక్తులకు మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. దాతల సౌకర్యార్థం, తిరుమలలోని దాతల విభాగంలో ఈ ట్రస్టు కోసం ప్రత్యేకంగా ఒక కౌంటర్‌ను కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. భక్తులు, దాతలకు శ్రీవారి దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి.

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో పెరిగిన ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణలో పెరిగిన ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ తెలంగాణలో మార్చి రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు 40...
By Pinnehasan Odela 2026-03-06 06:38:45 0 252
Andhra Pradesh
Passbooks: ఏపీ రైతులకు శుభవార్త.. జనవరి 2న వీటిని ఉచితంగా తీసుకోండి!
ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సరంలో రైతులకు శుభవార్త చెబుతోంది. ఐతే.. దీని వల్ల రైతులకు కొత్తగా కలిగే...
By Siva Bhaskar 2025-12-27 03:57:17 0 704
Andhra Pradesh
Nitin Gadkari: ఏపీకి శుభవార్త చెప్పిన నితిన్ గడ్కరీ.
Andhra   Gadkari good news for Andhra Pradesh మచిలీపట్నం పోర్టుకు రూ. 573.77 కోట్లతో...
By Pagadala Venkateswar 2026-02-06 04:48:14 0 226
Telangana
సీసీ రోడ్డు ప్రారంభించిన. నర్సంపేట..ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు...
భారత్ ఆవాజ్  న్యూస్ : 27 ఏప్రిల్ నెక్కొండ   పట్టణలోని బీసీ కాలనీ వాస్తవ్యుల చిరకాల...
By Gujile Ramu 2026-04-27 23:47:02 0 172
Telangana
ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన భారత ఆవాజ్ రిపోర్టర్ రవి మహంకాళి
నిన్నా రాత్రి సమయంలో టిప్పర్ లారీ శరవేగానికి. బైక్ మీద వెళ్తున్నా ఒక యువకుడి బైక్ గుద్ది...
By Mahankali Ravi 2026-04-21 10:04:49 0 437
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com