ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కార్యాలయన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మట్, వర్షాకాలం ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం

0
319

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్

ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ రాబోయే వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు, చర్యలు చేపట్టాలని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మార్మట్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఆసిఫాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అంజయ్యతో కలిసి పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా యువరాజ్ మార్మట్ మాట్లాడుతూ, ఆసిఫాబాద్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ. 15 కోట్ల నిధులను కేటాయించిందని తెలిపారు. ఈ నిధులను ప్రణాళికాబద్ధంగా సద్వినియోగం చేసుకుంటూ, పట్టణంలో పెండింగ్‌లో ఉన్న వార్డుల అభివృద్ధి పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా డ్రైనేజీ వ్యవస్థలను, మౌలిక వసతులను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
జిహెచ్ఎంసి జోన్స్, సర్కిల్స్ పెంచుతూ ఉత్తర్వులు జారీ.|
హైదరాబాద్ :  జీహెచ్ఎంసీలో ఇకపై 12 జోన్లు, 60 సర్కిల్స్  జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు...
By Sidhu Maroju 2025-12-25 18:33:29 0 287
Telangana
పెద్దపల్లి : తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి...!
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కేంద్రానికి చెందిన గీత కార్మికులు బిక్షపతి కుమిరే గ్రామంలో...
By Sunka Santhosh 2026-06-18 19:18:19 0 176
Andhra Pradesh
గంగమ్మ జాతర లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: DSP.
సిటిఎం గంగమ్మ జాతర సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సోమవారం మదనపల్లి డీఎస్పీ మహేంద్ర...
By Pagadala Venkateswar 2026-02-03 06:20:09 0 178
Telangana
దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన
కరీంనగర్‌లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన...
By Ponnala Srinivasrao 2026-05-09 02:16:23 0 165
Telangana
బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరదు...సీఎం రేవంత్ రెడ్డి
‎బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరదు ఈ POCSO...
By Ponnala Srinivasrao 2026-05-16 02:30:12 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com