"బస్తీల బాట పట్టిన ఎమ్మెల్యే శ్రీగణేష్.. నవ కంటోన్మెంట్ లక్ష్యంగా క్షేత్రస్థాయి పర్యటన".|

0
266

మేడ్చల్–మల్కాజిగిరి : జిల్లాలో నవ కంటోన్మెంట్ నిర్మాణ లక్ష్యంతో అభివృద్ధి పనులకు మరింత వేగం తీసుకురావాలని సంకల్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ బుధవారం బొల్లారం పరిధిలోని జనప్రియ బంగ్లా, శాంతి నగర్ కాలనీ, గడ్డి బస్తీలలో విస్తృతంగా పర్యటించారు.

సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బస్తీల్లో కాలినడకన పర్యటించిన ఎమ్మెల్యే, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. 

డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, కమ్యూనిటీ హాళ్ల అవసరం వంటి పలు మౌలిక వసతుల అంశాలపై స్థానికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ, నవ కంటోన్మెంట్ నిర్మాణం కేవలం నినాదంగా కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే అభివృద్ధి కార్యక్రమంగా నిలవాలని తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రాంతంలోని మౌలిక వసతుల సమస్యలను దశలవారీగా పరిష్కరించి ప్రజలకు మెరుగైన జీవన వాతావరణాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. 

ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వానికి, తమ ప్రజాప్రతినిధిత్వానికి ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో కాలనీల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, నాని, రామచంద్రారెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో బస్తీవాసులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
గెజిటెడ్ సంతకం కోసం లంచం డిమాండ్
వెయ్యి తీసుకుని.. మిగతా రూ.4 వేల కోసం హెచ్ఎం వేధింపులు!           ...
By Bheeshman King 2026-07-08 12:57:44 0 799
Andhra Pradesh
పూర్ణపాడులో ఏనుగులు
పూర్ణపాడు గ్రామ పరిసరాల్లో ఏనుగుల సంచారం ఉన్నందున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా...
By Boiena Rajesh 2026-08-27 13:23:56 0 110
Andaman & Nikobar Islands
NTPC Triggers Green Energy Shift in Port Blair
In a significant push for carbon neutrality, NTPC Limited has officially invited bids for a...
By Dunna Jessicaruth 2026-05-14 09:29:06 0 104
Telangana
నిజామాబాద్: మోధటి జనగణన self - Enumeration చెసుకున్న ఎంపి అరవింద్
నిజామాబాద్  : మోధటి జనగణన సంధర్బంగా ఎంపి ధ్రంపురి అరవింద్ గారు self - Enumeration...
By Sadaq Sadaq 2026-04-26 12:23:48 0 165
Telangana
ఆసిఫాబాద్ దస్నాపూర్ అగ్నిప్రమాద బాధితులకు కాంగ్రెస్ అండ – డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క భరోసా
🎤భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్ పట్టణ పరిధిలోని దస్నాపూర్ కాలనీలో గత అర్ధరాత్రి...
By Chunarkar Jagadeesh 2026-06-04 10:03:43 0 360
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com