దండేపల్లి లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్న శాసనసభ్యులు

0
176

మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలంలోని ధర్మారావుపేట్ గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు ద్వారా 104 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ఇవ్వడం జరిగిందని . అందులో భాగంగా ఈరోజు 41 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల సాముహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని కొల్లూరి సుజాత - మల్లేష్ మరియు కొల్లూరి స్నేహ - మధుకర్ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పేదవాడికి సొంతంటి కల సాకారం చేయడమే ఈ ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు,ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, సురేఖ దంపతులను శాలువాలతో సన్మానించరు ,అనంతరం గ్రామపంచాయతీ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని గ్రామ ప్రజలందరితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని వాటి అన్నిటిని పరిష్కరిస్తానని తెలిపారు,ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్, సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: మధ్యాహ్న భోజనంలో పడ్డ బల్లి
అన్నమయ్య జిల్లా, పుంగనూరులోని మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో బుధవారం మధ్యాహ్న భోజనంలో బల్లి...
By Kothuru Murali 2026-04-02 06:10:55 0 181
Andhra Pradesh
KL యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ పరీక్ష ఫలితాలు విడుదల
*కె ఎల్ యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.* ఆడపిల్లకు చదువే అసలైన...
By Rajini Kumari 2026-01-10 12:42:30 0 224
Andhra Pradesh
పీపీపీ పద్ధతి అంటే అర్థం తెలియని జగన్ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు!!!!
పీపీపీ పద్ధతి అంటే అర్థం తెలియని జగన్ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. నిజానికి పీపీపీ...
By SivaNagendra Annapareddy 2025-12-22 10:22:56 0 205
Andhra Pradesh
సీఎం తో మదనపల్లి అభివృద్ధిపై చర్చించిన ఎమ్మెల్యే.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం సీఎం చంద్రబాబు నాయుడును...
By Pagadala Venkateswar 2026-02-24 07:36:44 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com