ఆసిఫాబాద్‌లో వర్షాకాలం ముందస్తు చర్యలు ముమ్మరం: డ్రైనేజీల క్లీనింగ్

0
712

🎤కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ :

ఆసిఫాబాద్: త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కంచకోట ప్రాంతంలో మురుగు కాలువలను జేసీబీ సహాయంతో మున్సిపల్ సిబ్బందితో శనివారం ముమ్మరంగా శుభ్రం చేయించారు. ఈ పనులను మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వర్షాకాలంలో పట్టణంలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ ముందస్తు పారిశుధ్య చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వర్షాలు పడేలోపే ప్రధాన డ్రైనేజీలను, సైడ్ కాలువలను పూర్తిగా పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. అయితే, మున్సిపల్ సిబ్బంది ఎంత శ్రమించినా ప్రజల సహకారం లేకపోతే ఫలితం ఉండదని, ఎవరూ కూడా కాలువల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు వేయకుండా పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువ నాయకుడు సాయి శ్రావణ్, మున్సిపల్ అధికారులు, వార్డు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Nagaland
Zunheboto Halts Illegal Commercial LPG Misuse
The Zunheboto district administration has launched a strict regulatory enforcement drive...
By Lokeshwari Panthadi 2026-06-26 07:17:39 0 74
Andhra Pradesh
శశాంక్ కనుమూరికి CM అభినందనలు
*Photo:* రాష్ట్రానికి చెందిన ఈక్వేస్టేరియన్ ఈవెటింగ్ క్రీడాకారుడు శశాంక్ కనుమూరి ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-25 07:36:58 0 232
Andhra Pradesh
సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు.
X సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు 25-06-2026 Thu Andhra CI...
By Pagadala Venkateswar 2026-06-25 06:14:38 0 74
Andhra Pradesh
కారులో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ – దర్శకుడిపై కేసు
కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతిని వెబ్ సిరీస్‌లో అవకాశం కల్పిస్తానని నమ్మించి మోసం చేసిన ఘటన...
By Ratna Sekhar 2026-03-08 17:37:15 0 1K
Andhra Pradesh
నకిలీ నోట్ల కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్, ఫిరంగిపురం పోలీసులు – ముగ్గురు నిందితులు అరెస్ట్
నకిలీ నోట్ల కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్, ఫిరంగిపురం పోలీసులు – ముగ్గురు నిందితులు అరెస్ట్...
By Chennaiah Kati 2026-07-22 15:22:02 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com