విజయవాడ అంటేనే విద్యల వాడ ఎంపీ కేసినేని శివనాథ్

0
150

*ప్రెస్ నోట్*

 

*30-5-2026*

 

*విజయవాడ అంటేనే విద్యలవాడ - ఎంపీ కేశినేని శివనాథ్*

 

*ఎంటర్ప్రేన్యూర్ కాదు ఆంధ్రప్రెన్యూర్ రావాలనేది ముఖ్యమంత్రి ఆలోచన*

 

*ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు*

 

*త్వరలో ఏపీకి స్పోర్ట్స్ యూనివర్సిటీ*

 

*టీవీ9 & క్యాబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎడ్యుకేషనల్ ఎక్స్పో ను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని*

 

విజయవాడ (తూర్పు నియోజకవర్గం) విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని లబ్బీపేట ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ నందు టీవీ9 మరియు క్యాబ్ సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషనల్ ఎక్స్పోను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఎంపీ చిన్నికి టీవీ9 మరియు క్యాబ్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు ఎడ్యుకేషనల్ ఎక్స్పోను ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించి ఎక్స్పోలో పాల్గొన్న అన్ని యూనివర్సిటీ స్టాల్స్ అన్నిటిని ప్రత్యేకంగా పరిశీలించారు

 

అనంతరం ఎక్స్పో కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ చిన్ని మాట్లాడుతూ విజయవాడ అంటే విద్యలవాడ అని తాను కూడా ఒక మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థినేనని ఇంజనీరింగ్ రంగంలో విద్యార్థులు మెరుగ్గా రాణించడానికి విద్యార్థులకు అన్ని విధాలుగా ప్రభుత్వం తో పాటు యూనివర్సిటీస్ అన్ని సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు కేఎల్ యూనివర్సిటీ లో ఒక మెకానికల్ విద్యార్థికి 88 లక్షల ప్యాకేజీ రావడం రాష్ట్రానికే గర్వకారణం అని ఎంపీ చిన్ని అన్నారు. దేశానికి కావాల్సింది ఎంటర్ప్రైన్యువర్స్ మాత్రమే కాదు అందులో ఎక్కువ మంది ఆంధ్రప్రేన్యూర్స్ ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని తెలిపారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో రాష్ట్రానికి అనేక ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని అందుకే ఐటీ మరియు మెడికల్ రంగాలలో విప్లవాత్మక మార్పులు జరిగాయని అన్నారు

 

ఇప్పుడు నూతన విధానంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైన్యూర్ అనే కొత్త విధానాన్ని ముఖ్యమంత్రి తీసుకొచ్చారు దీని ద్వారా ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రైన్యూర్ రావాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచనని స్పష్టం చేశారు అటు యూనివర్సిటీలకు సంబంధించిన మాట్లాడుతూ యూనివర్సిటీల్ని కోరేది కూడా లైఫ్ స్టైల్ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మారింది కాబట్టి దానికి అనుగుణంగానే ఉన్న కోర్సులు తీసుకువచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ కు కూడా ప్రత్యేక కోర్సును ఏర్పాటు చేయాలని చేయాలని చిన్ని అన్నారు. అటు విద్యతోపాటు క్రీడాలకు కూడా అంతే విధమైన ప్రాధాన్యత ఇవ్వాలని భారత దేశంలో స్పోర్ట్స్ వల్ల బ్రహ్మాండమైన ఎకానమీ పెరిగిందని తెలిపారు. త్వరలో ఏపీకి కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుందని అన్నారు 

 

అటు ఉపాధి విషయాల్లోనూ ఏపీ నంబర్వన్ గా ఉండాలన్నదే చంద్రబాబు లోకేష్ లక్ష్యమని గూగుల్ ఏఐ డేటా సెంటర్ హబ్ గా త్వరలో విశాఖ మారబోతుందని క్వాంటం కంప్యూటర్ కోర్సులతోపాటు ఏఐ మరియు రోబోటిక్స్ కోర్సులపై కూడా యూనివర్సిటీస్ ప్రత్యేకమైన దృష్టి సాధించాలని అన్నారు రతన్ టాటా పేరుతో 5 ఇన్నోవేషన్ హబ్ లు ఏర్పాటు చేశామని ఇలాంటి అవకాశాలన్నీ ఈ రాష్ట్రంలో ఉన్నాయని ప్రతి విద్యార్థి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ అవకాశాలన్నీ పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు టీవీ9 ట్యాగ్ మెరుగైన సమాజం కోసం అని ఏదైతే చెప్తారో ఇలాంటి ఒక మంచి ఎక్స్పోను తీసుకురావడం నిజంగా మంచి విషయమని టీవీ9 మరియు క్యాబ్ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజుల్లో భావి భారత విద్యార్థుల భవిష్యత్తు యూనివర్సిటీల చేతుల్లోనే ఉందని వారిని మంచి పౌరులుగా ఈ సమాజానికి అందించాలని ఎంపీ చిన్ని ఆకాంక్షించారు

Search
Categories
Read More
Telangana
చినరాయుని చెరువు శుభ్రపరిచే పనులు వేగం - పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక చినరాయుని చెరువును శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతమైంది. ఈ...
By Sidhu Maroju 2026-03-10 13:30:28 0 231
Andhra Pradesh
పుంగనూరు: విపక్షాల తీరుపై మైనార్టీ మోర్చా ధ్వజం
చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు అనుసరిస్తున్న...
By Kothuru Murali 2026-04-18 09:31:03 0 151
SURAKSHA
T. Arun, IAS: Transforming Governance with Vision & Service
The Journey Begins  A Leader Driven by Public Service "Good governance is not merely about...
By Fathima Safa 2026-08-01 13:13:12 0 311
Telangana
కరీంనగర్ పాసుపోర్టు ఆఫీసులలో అధికారుల నిర్లక్ష్య సమాధాన వైఖరి?
కరీంనగర్ జిల్లా పాస్పోర్ట్ ఆఫీస్ లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాదన రోజు అధిక...
By Thalakokkula Sadanandam 2026-03-11 18:09:41 1 3K
Andaman & Nikobar Islands
Infrastructure and Transport Drive Island Connectivity
Infrastructure and transport development continue to transform connectivity across the Andaman...
By Fathima Safa 2026-06-27 10:45:27 0 178
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com