మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

0
137

*మాదకద్రవ్యల నియంత్రరణపై ప్రత్యేక దృష్టి*

 

 

    • *విద్యాసంస్థలు, హాట్ స్పాట్‌ల్లో అవగాహన కార్యక్రమాలు*     

 

 

      *మాదకద్రవ్య రహిత జిల్లా గా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం..*

 

 

    • *మాదక ద్రవ్యల అరికట్టడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి..*    

 

 

      *జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు.*

 

 మాదక ద్రవ్యల మత్తుతో యువత విలువైన జీవితం చిత్తు కాకూడదని మాదకద్రవ్యల నియంత్రరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యాసంస్థలు, హాట్ స్పాట్‌ల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లా గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు పిలుపునిచ్చారు. 

  మాదక ద్రవ్యాల నిర్మూలనకై ఏర్పాటు చేసిన నషా ముక్త్ భారత్ అభియాన్ నార్కో కోఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి సమన్వయం సమావేశం శనివారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ డా. జి లక్ష్మీశ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో డ్రగ్స్‌పై దండయాత్ర విజయం, జిల్లాలో నిర్వహిస్తున్న విస్తృత అవగాహన కార్యక్రమాలు, ఈగల్ ఆపరేషన్స్, డీ అడిక్షన్ కేంద్రం సేవలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, హాట్‌స్పాట్స్ తనిఖీలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

 

  ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మాదకద్రవ్యాలను సేవించే వ్యక్తిని మాత్రమే కాకూండా వారికి సంబంధించిన మొత్తం కుటుంబంపై తీవ్రంగా ప్రభావాన్ని చూపుతుందన్నారు. డ్రగ్స్ సేవించడం వలన శరీరం మనస్సు సమాజిక జీవితం చిన్న భిన్నమవుతుందన్నారు. శరీరక ఆనారోగ్యంతో పాటు గుండె జబ్బులు కాలేయం, ఊపిరితిత్తుల సమస్యల బారిన పడి రోగనిరోధక శక్తి తగ్గడం ద్వారా ప్రాణాపాయస్థితికి చేరుకోవాల్సి వస్తుందన్నారు. మానసిక ఆందోళన జ్ఞాపకశక్తి తగ్గడం ఏకాగ్రత లోపించడం తదితర కారణాలతో డిప్రెషన్‌కి లోనై కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులతో పాటు చట్టపరమైన చిక్కులను ఎదురుకోవాల్సి వస్తుందన్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ ఆనవాళ్లను సమూలంగా తొలగించే సంకల్పంతో ఈగల్, పోలీస్, రెవెన్యూ, విద్య, వైద్య ఆరోగ్యం తదితర సమన్వయ శాఖల భాగస్వామ్యంతో పెద్దఎత్తున నిర్వహించిన డ్రగ్స్‌పై దండయాత్ర విజయవంతమైందన్నారు. జిల్లాలోని గుర్తించిన సుమారు 150 హాట్‌స్పాట్‌ల్లో కీలకమైన ప్రాంతాల్లో రాత్రిపూట కూడా అత్యాధునిక నైట్ విజన్ డ్రోన్లతో నిఘా ఉంచాలని సూచించారు. మాదక ద్రవ్యాలపై పోరులో స్వచ్ఛంద సంస్థలు కూడా కీలక భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. 1972 టోల్‌ఫ్రీ నంబరు గురించి ప్రజలకు తెలియజేసేలా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరముందన్నారు. మాదకద్రవ్య సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరూ చేయీచేయీ కలిపి అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈగల్ స్టాల్స్‌తో ప్రజాబాహుళ్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మాదక ద్రవ్యలను సమూలంగా నివారించేందుకు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ డా.జి.లక్ష్మీశ సూచించారు. 

  పోలీస్ కమీషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థతో పాటు సమాజాన్ని అస్తవ్యస్తం చేసే మాదకద్రవ్యాలను సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్తాములు కావాలన్నారు. మాదక ద్రవ్యల సరఫరా వినియోగం చేసే వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని పటిష్టమైన పోలీస్ నిఘాను ఏర్పాటు చేసి ఆసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని గురించి కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యల నిర్మూలన వినూత్న కార్యక్రమాలను ఉద్యమంగా నిర్వహించి యువతలో అవగాహన కల్పిస్తున్నామని సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు. హాట్‌స్పాట్ ప్రాంతాలతో పాటు రైల్వేస్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లోనూ నిఘా పెంచాడంతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని వినూత్న కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక బద్దంగా అడుగులు వేస్తున్నామన్నారు. 

 ఈ సందర్భంగా ఫోరం ఫర్ చెల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు నివారణపై ప్పు్రలలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పోలీస్ కమీషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆవిష్కరించారు.  

  కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, 

 ఏ డి సి పి లలిత కుమారి, జిల్లా విభిన్న ప్రతిభావంతులు, టీజీ, వయోవృద్ధుల సంక్షేమ అధికారి ఎం ఫణి దూర్జటి, డిఇవో చంద్రకళ. ఈగల్ అధికారులు ఎం.రవీంద్ర, సంక్షేమ శాఖ ముఖ్యకార్యనిర్వహణ అధికారి డా. కొల్లేటి రమేష్, హెల్త్ కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ఎం అనిల్ కుమార్, ప్రముఖ ఫిజియాలజిస్ట్ ఆకర్ష ఫౌండేషన్ సైకాలజిస్టులు డా. శంకర్‌రావు, నవజీవన్ బాల్ భవన్ ప్రతినిధి శేఖర్‌బాబు, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కో- ఆర్డినేటర్ ఆరవ రమేష్,వివిధ స్వచ్చంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: కరెంటు షాక్‌తో ఎలక్ట్రిషియన్‌కు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో ఆదివారం, ఎలక్ట్రిషియన్ మహబూబ్ జానీ (38) కొత్తపల్లిలో ఒక ఇంటికి యాంటెన్నా...
By Pagadala Venkateswar 2026-03-01 09:42:22 0 200
Telangana
డిగ్రీ లేదు.. వైద్యం మాత్రం చేస్తున్నారు.|
● అర్హతలు లేకుండానే క్లినిక్‌ల నిర్వహణ ● ఐదుగురు నకిలీ వైద్యుల అరెస్ట్ ● భారీగా అల్లోపతి...
By Sidhu Maroju 2026-09-02 12:02:40 0 101
Telangana
దిల్ కుష్ నగర్ లో టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ పాదయాత్ర
  టిపిసిసి ఉపాధ్యక్షుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ...
By Jagadeesh Babu 2026-05-17 11:07:04 0 327
BMA
Unsafe Districts: The Urgent Need for Rural Press Clubs
While urban journalists have established Press Clubs for solidarity and legal defense, mofussil...
By JoinBMA 2026-08-21 09:56:53 0 70
BMA
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears In a democracy, media is not just a messenger —...
By BMA ADMIN 2025-05-24 06:25:30 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com