మండవ కుటుంబారావు మూడవ వర్ధంతి సందర్భంగా టిటిడి కి 15 టన్నుల కూరగాయల లారీ ప్రారంభ సేవ

0
118

ప్రచురణార్థం:- 29-05-2026

 

*మండవ కుటుంబరావు 3వ వర్ధంతి సందర్భంగా టీటీడీకి 15 టన్నుల కూరగాయల లారీ ప్రారంభం,సేవా కార్యక్రమాల ద్వారా మండవ కుటుంబరావు ఆశయాలను కొనసాగిస్తున్న కుటుంబ సభ్యులు అభినందనీయులు - MLA బొండా ఉమామహేశ్వరరావు గారు*

 

ధి:- 29-05-2026 ఈరోజు ఉదయం ఏలూరు రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ చుట్టుగుంట వద్ద కీర్తిశేషులు మండవ కుటుంబరావు గారి 3వ వర్ధంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి 15 టన్నుల కూరగాయల లారీని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా బొండా ఉమ గారు మాట్లాడుతూ:- కీర్తిశేషులు మండవ కుటుంబరావు గారు జీవించి ఉన్న సమయంలో ప్రతి నెలా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి లారీల ద్వారా కూరగాయలు పంపిస్తూ విశిష్టమైన సేవ అందించేవారని గుర్తు చేశారు. ఆ సేవా కార్యక్రమాల్లో తాము కూడా ఎన్నోసార్లు పాల్గొన్నామని తెలిపారు.

 

ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన కుటుంబ సభ్యులు అదే సేవా స్ఫూర్తితో ఆయన పేరుమీద సేవా కార్యక్రమాలను కొనసాగించడం గొప్ప విషయమని కొనియాడారు. విజయవాడ నగరంలో మండవ కుటుంబరావు గారి సేవలను, వ్యక్తిత్వాన్ని తెలియని వారు ఉండరని, ఆయన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ సమాజ సేవకు అంకితభావంతో జీవించారని అన్నారు.

 

ఆయన లేని లోటును కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాల ద్వారా భర్తీ చేస్తూ ముందుకు సాగడం సంతోషకరమన్నారు. వర్ధంతి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ, మజ్జిగ పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులకు, అసోసియేషన్ ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.

 

అనంతరం కీర్తిశేషులు మండవ కుటుంబరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.

 

ఈ కార్యక్రమంలో :- మాజీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి, ఎం. నాగేందర్ (నాగు), గుమ్మడి సురేష్, బోయపాటి అరుణ్, నువ్వుల రాజేష్, మేదరమట్ల శ్రీనివాస్, నందగోపాల్ నాయుడు, నూతక్కి శివరామకృష్ణ, తుమ్మల భోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Andhra Pradesh
ఎర్నాకుళం వెళ్లే రైలులో అనకాపల్లి దగ్గర అగ్నిప్రమాదం ఒకరు మృతి రెండు ఏసీ బోగీలు దగ్ధం
*Train Fire: అనకాపల్లి దగ్గర రైలులో అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు దగ్ధం.. ఒకరు మృతి*  ...
By Rajini Kumari 2025-12-29 08:36:02 0 360
Telangana
పేరుకే కేంద్రాలు... మక్కలు దళారుల పాలు...
పేరుకే కేంద్రాలు.. మ‌క్క‌లు దళారుల పాలు మొక్కజొన్న కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం...
By Gujile Ramu 2026-04-30 17:06:14 0 201
Andhra Pradesh
మదనపల్లి: ప్రకృతి వ్యవసాయ కరదీపికల ఆవిష్కరణ.
ఎల్ నిన్యో వాతావరణ మార్పుల నేపథ్యంలో మదనపల్లె కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్...
By Pagadala Venkateswar 2026-06-10 05:22:56 0 104
Andhra Pradesh
మదనపల్లె: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు - జేసీ.
అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) శివ్ నారాయణ శర్మ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)...
By Pagadala Venkateswar 2026-04-07 04:02:14 0 179
Andhra Pradesh
బీసీవై నాయకుల సత్య ప్రమాణం: టీడీపీ ఆరోపణలు అవాస్తవమని దేవుని సాక్షిగా ప్రకటన కొత్తూరు మురళి
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం రాజనాలబండలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో...
By Kothuru Murali 2026-05-28 18:40:53 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com