పేరుకే కేంద్రాలు... మక్కలు దళారుల పాలు...

0
200

పేరుకే కేంద్రాలు.. మ‌క్క‌లు దళారుల పాలు

మొక్కజొన్న కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

45 డిగ్రీల ఎండలో రైతుల అగచాట్లు

ప్రభుత్వ తీరుపై పోరాటాలకు సిద్ధం.

న‌ర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి.

వరంగల్ జిల్లా :భారత్ అవాజ్ న్యూస్ నల్లబెల్లి: రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని, ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్ల రైతులు దలార్ల చేతుల్లో మోసపోతున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. గురువారం నల్లబెల్లి మండలం గుండ్లపాడులోని ఎస్‌డబ్ల్యుసీ గోదాంను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే లారీలు రోజుల తరబడి క్యూలలో నిలిచిపోతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం కేవలం రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండటానికే పేరుకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని, వాస్తవానికి కొనుగోలు చేసే ఉద్దేశం లేదని ఆరోపించారు. గన్ని సంచులు, రవాణా ఖర్చులను రైతులపైనే మోపడం అన్యాయమని అన్నారు. గత 40 రోజులుగా రైతులు 45 డిగ్రీల ఎండలో కల్లాల వద్ద కాంటాల కోసం ఎదురుచూస్తున్నారని, వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 20 శాతం కూడా కొనుగోలు పూర్తి కాలేదని వెల్లడించారు. కొనుగోలు చేసిన పంటకు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని విమర్శించారు..

గతంతో పోలిక.. వ్యవస్థల నిర్వీర్యం...

తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నర్సంపేట నియోజకవర్గంలో 42 కొనుగోలు కేంద్రాలు ఉండేవని, ప్రస్తుతం మండలానికి ఒకటి చొప్పున కేవలం ఆరింటినే ఏర్పాటు చేసి రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఐకేపీ, రైతు సంఘాల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు. నియోజకవర్గంలో 90 వేల ఎకరాల్లో సాగు ఉన్నప్పటికీ, స్థానిక ఎమ్మెల్యేకు మక్కల దిగుబడి, గోదాముల సామర్థ్యంపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. పంట కొనుగోలులో జరుగుతున్న ఆలస్యానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులే బాధ్యులని పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు మద్దతుగా శుక్రవారం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై నిరసనలు, పోరాటాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు... దుగ్గొండి రిపోర్టర్ జి రాము 

 

Search
Categories
Read More
SURAKSHA
Haryana STF Crackdown Bags Gangsters & Extradites Fugitives
The Haryana Police are successfully dismantling major criminal syndicates through their...
By Lokeshwari Panthadi 2026-07-04 08:38:36 0 88
Andhra Pradesh
మదనపల్లె: మహిళలకు 33% సీట్ల కేటాయింపు చారిత్రాత్మకం -సుగవాసి.
రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలనే టీడీపీ నిర్ణయంపై మదనపల్లెలో శుక్రవారం హర్షం...
By Pagadala Venkateswar 2026-05-30 05:09:02 0 105
Andhra Pradesh
వైసీపీ అధినేత జగన్ కుటుంబంలో క్రిస్మస్ వేడుకలు
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, ఈ వేడుకల్లో...
By John Baji 2025-12-25 06:16:18 0 242
Telangana
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు: డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని బీజేపీ...
By Gujile Ramu 2026-04-23 12:42:07 0 249
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో కారులో మంటలు
పుంగనూరు పట్టణంలో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ సమీపంలో బుధవారం రాత్రి మరమ్మతుల్లో ఉన్న రేనాల్డ్...
By Kothuru Murali 2026-03-12 14:56:07 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com