కూకట్పల్లిలో 62 మంది నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ

0
419

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే కలుషితరహిత త్రాగునీరు, మెరుగైన రహదారులు, నిరంతర విద్యుత్ సరఫరా, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యవసరమని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.

కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని కైతలాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను 62 మంది నిరుపేద లబ్ధిదారులకు కేటాయిస్తూ పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి స్వయంగా లబ్ధిదారులకు పట్టాలు అందజేసి, ఒక ఇంటిలో పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమం కైతలాపూర్ లో జరిగింది.

ఈరోజు జరిగిన కార్యక్రమంలో పట్టాల పంపిణీ చేపట్టారు.

కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తో పాటు ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కలెక్టర్ మనో చౌదరి, జోనల్ కమిషనర్, ఎమ్మార్వో మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

   నిరుపేదలకు గృహ వసతి కల్పించడం, మహిళల ఆర్థికాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పెట్రోల్ బంకుల కేటాయింపు, మహిళా సంఘాలకు బస్సుల అందజేత వంటి పథకాల ద్వారా మహిళల సాధికారతకు కృషి చేస్తోందన్నారు. అలాగే చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

  కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ మాట్లాడుతూ కూకట్‌పల్లి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో నిరుపేదలు ఉన్నారని, వారికి మరిన్ని నిధులు కేటాయించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని విస్తరించాలని మంత్రిని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఈ బోడెద్దుల విలువ ఎంతో తెలుసా...
పుంగనూరు ఎద్దుల పరుషలో రూ. 5,50,000 విలువైన జోడెద్దులు అందరి దృష్టిని ఆకర్షించాయి. సత్యసాయి...
By Kothuru Murali 2026-05-07 12:16:19 0 167
Andhra Pradesh
 216 జాతీయ రహదారి పరిశీలనలో బాపట్ల డిఎస్పి రామాంజనేయులు, రూరల్ సీఐ శ్రీనివాస్ రావు,సర్కిల్ సీఐ హరి కృష్ణ,ఆర్టీవో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు
216 జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్ పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్  ...
By Gadiyapudi Narendra 2025-12-24 17:18:07 0 554
Andhra Pradesh
ఈరోజు శ్రీమతి సావిత్రి పూలే బాయ్ జయంతి
ఈరోజు శ్రీమతి సావిత్రి బాయ్ గారి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి రాజారపు శివ...
By Rajini Kumari 2026-01-03 09:25:20 0 272
Andhra Pradesh
మదనపల్లె: సైబర్ మోసాల అడ్డాగా మార్చుకున్న కేటుగాళ్లు.
మదనపల్లె కేంద్రంగా జరుగుతున్న సైబర్ మోసాలపై దర్యాప్తు చేసేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులు బుధవారం...
By Pagadala Venkateswar 2026-03-05 03:44:21 0 181
Andhra Pradesh
శశాంక్ రెడ్డి అండర్ 14 స్క్వాష్ జట్టుకు ఎంపిక.
మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి జి. శశాంక్ రెడ్డి...
By Pagadala Venkateswar 2026-04-11 12:48:44 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com