రాత్రి పగలు తేడా లేకుండా ప్రాణాలు కాపాడుతున్న నిశ్శబ్ద పోరాట యోధులు!
నేడు '108 పైలట్ల' దినోత్సవం సందర్బంగా వారికి శుభాకాంక్షలు
ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుల్లా నిలుస్తున్న 108 సిబ్బందికి సెల్యూట్
మహబూబాబాద్, మే 26: కూతపెడితే చాలు.. నిమిషాల్లో ప్రత్యక్షమై, మృత్యువుతో పోరాడుతున్న ప్రాణాలను సురక్షితంగా ఆసుపత్రికి చేర్చే అపర సంజీవని... '108 అంబులెన్స్'. మరి ఈ అంబులెన్స్ వెనుక ఉండి, ప్రతి సెకనూ ఎంతో విలువైనదని భావించి, ట్రాఫిక్‌ను సైతం చీల్చుకుంటూ దూసుకెళ్లేవారే 108 పైలట్లు (డ్రైవర్లు). ఎండనక, వాననక, అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా... ఫోన్ కాల్ వచ్చిన వెంటనే స్పందించి, ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న వీరి సేవలు నిజంగా వెలకట్టలేనివి. ప్రమాద సమయాల్లోనూ, అత్యవసర ప్రసవాల సమయంలోనూ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, ఎన్నో కుటుంబాల్లో వీరు వెలుగులు నింపుతున్నారు."సమయానికి ఆసుపత్రికి చేరిస్తే ప్రాణం నిలుస్తుందనే నమ్మకానికి నిలువెత్తు రూపం 108 పైలట్లు." కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం తమ ప్రాణాలను పణంగా పెట్టి, సమాజం కోసం వీరు చేసిన సేవలను ఈ సమాజం ఎప్పటికీ మరువలేదు. కేవలం వాహనాన్ని నడపడమే కాకుండా, క్షతగాత్రులను చేతులతో మోస్తూ, మానవత్వాన్ని చాటుకుంటున్న ప్రతి ఒక్క 108 పైలట్‌కు మరియు ఇమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ (EMT) అందరికీ స్వతంత్ర టీవి ఛానల్ తరఫున, ప్రేక్షకుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు." "ఆపదలో ఉన్నవారికి దేవుడిలా కనిపించే 108 పైలట్లు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని, వారి సేవలకు తగిన గుర్తింపు లభించాలని ఆకాంక్షిద్దాం.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz