నాచెక్ ఎటుపాయె..!

0
810

మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కు మాయం..?

 మరోసారి చెక్కుల లీకేజీ కలకలం!

మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కు మాయం..?

మరోసారి చెక్కుల లీకేజీ

మంజూరైన చెక్కును మాయం చేసిన నాయకులు ఎవరు?

సీఎంఆర్‌ఎఫ్ అవినీతి నేరమే కాదు.. మహాపాపం అంటున్న బాధితులు!

మహబూబాబాద్, మే 24(భారత్ అవాజ్): కొత్తగూడ మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) నిధుల మంజూరు విషయంలో మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి....రెండు సంవత్సరాల క్రితం మంజూరైన ఆర్థిక సహాయం ఇప్పటికీ లబ్ధిదారునికి అందలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది...

పేదల వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సీఎం సహాయ నిధి పథకం అమలులో నిర్లక్ష్యమా..? లేక మరేదైనా అక్రమాలున్నాయా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి...

కొత్తగూడ మండలం జంగవానిగూడెం గ్రామానికి చెందిన సన్ప సారయ్య రెండు సంవత్సరాల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ చికిత్స కోసం కుటుంబానికి రూ.2 లక్షల 50 వేలకుపైగా ఖర్చు అయింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

మంత్రి సీతక్క సిఫార్సు చేసిన చెక్ ఎటుపోయిందో...

స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క సిఫార్సుతో దరఖాస్తును పరిశీలించిన అధికారులు నాలుగు నెలల వ్యవధిలోనే ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే మంజూరైన చెక్కు ఇప్పటివరకు తమ చేతికి అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు వైద్య సహాయం అందించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్‌ను వరంగా భావిస్తున్న వేళ, ఇలాంటి ఘటనలు పథకం అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. చెక్కు మంజూరైందని అధికారులు చెబుతుండగా, లబ్ధిదారునికి అందకపోవడం వెనుక కారణాలేమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఏజెన్సీ ప్రాంతాల్లో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు...

 అలాగే మంజూరైన ఆర్థిక సహాయాన్ని వెంటనే లబ్ధిదారునికి అందించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయం మంజూరైనప్పటికీ, రెండేళ్లుగా లబ్ధిదారునికి అందలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చెక్కు నిజంగా ఎక్కడ నిలిచిపోయింది..? ఎవరి వద్ద ఆగిపోయింది..? అనే విషయాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.....

Search
Categories
Read More
Telangana
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన   సారు మా పై దయాచూపండి     ...
By Vanmoj Suryamohan 2026-01-12 15:08:58 0 561
Andhra Pradesh
టీడీపీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం విజయవంతం.
మదనపల్లె పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో నెలవారీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం బుధవారం ఘనంగా...
By Pagadala Venkateswar 2026-06-25 05:59:04 0 131
Ladakh
Ladakh Accelerates Renewable Energy Development Drive
Ladakh continues to emerge as a key hub for renewable energy with the expansion of large-scale...
By Fathima Safa 2026-07-03 15:46:07 0 78
Andhra Pradesh
చౌడేపల్లి: అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శెట్టిపేట సమీపంలో మంగళవారం పంట పొలాల్లోకి అదుపు తప్పి...
By Kothuru Murali 2026-06-02 15:31:22 0 123
Telangana
Malkajgiri’s Pride: A Tribute to the Fearless Leader Eatala Rajender!|
Malkajgiri : A Leader of the Masses: Celebrating the Spirit of Eatala Rajender on His Birthday...
By Sidhu Maroju 2026-03-20 11:01:37 0 411
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com