"జింఖానా గ్రౌండ్స్‌లో భక్తి తరంగం.. యువతకు సంస్కృతి సందేశం ఇచ్చిన ఈటల రాజేందర్.|

0
338

సికింద్రాబాద్ : జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న “The Confluence – Rhythm of Bhakti” కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు.

యువతకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలోని యువత, ముఖ్యంగా 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉన్న Gen-Z తరగతి అనేక రకాల చెడు అలవాట్లకు గురై భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలను విస్మరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

దేశంలో శాంతి, సామరస్యం నెలకొనాలంటే యువత దేశ పురోగతిలో భాగస్వాములు కావాలని, కుటుంబ వ్యవస్థ బలోపేతానికి మానవ సంబంధాలు మరింత పరిపుష్టి చెందాల్సిన అవసరం ఉందన్నారు.

గతంలో పెద్ద కుటుంబాల్లో పెరిగిన పిల్లలు కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగారని, కానీ ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

అలాంటి తల్లిదండ్రుల ఆందోళనలను దూరం చేసి యువతలో సానుకూల మార్పు తీసుకురావడానికి “The Confluence – Rhythm of Bhakti” వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

చీకోటి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో G. కిషన్ రెడ్డి , N. రాంచందర్ రావు, తదితర ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలిపారు. 

యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇక్కడ నేర్చుకునే విలువలను జీవితంలో ఆచరించాలని ఈటల రాజేందర్ కోరారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై సీఎం చంద్రబాబు స్పందన.
Andhra Chandrababu Naidu welcomes India US trade deal భారత్, అమెరికా మధ్య చరిత్రాత్మక వాణిజ్య...
By Pagadala Venkateswar 2026-02-03 08:44:19 0 179
SURAKSHA
​. 'CEN' Wings for Tackling Cyber Crime
To combat growing digital threats, Karnataka Police established dedicated 'CEN' (Cyber, Economic,...
By Kalaga Sailaja 2026-06-29 11:47:22 0 279
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె జిల్లా పోలీసు ఆఫీసులో ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఏఎస్పీ ఎం. వెంకటాద్రి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పోలీసు కార్యాలయంలో ఘనంగా ప్రగడ కోటయ్య జయంతి.   జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్...
By Pagadala Venkateswar 2026-07-27 13:32:47 0 89
Telangana
"తాడ్‌బండ్‌లో భక్తి వెల్లువ… హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా!"
సికింద్రాబాద్ : తాడ్‌బండ్‌లోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం హనుమాన్ జయంతి సందర్భంగా...
By Sidhu Maroju 2026-04-02 06:49:09 0 248
Andhra Pradesh
కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
*కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు*   •...
By Rajini Kumari 2026-01-22 12:10:16 0 246
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com