జనసేన 'జాయినింగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్.

0
112

 

జనసేన 'జాయినింగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్

16-06-2026 Tue 

Andhra

Pawan Kalyan forms Jana Sena Joinings Committee

పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పవన్ కీలక నిర్ణయం

14 మంది సభ్యులతో 'జాయినింగ్స్ కమిటీ' ఏర్పాటు

విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించడమే లక్ష్యం

జనసేన పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించే దిశగా కీలక ప్రకటన చేశారు. 14 మంది సభ్యులతో కూడిన ‘జాయినింగ్స్ కమిటీ’ని ఏర్పాటు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

 

ఈ కమిటీలో జనసేన ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలకు స్థానం కల్పించారు. ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇతర సభ్యులుగా పార్టీ సీనియర్ నేతలు కొటికలపూడి చినబాబు, డా. హరిప్రసాద్, డా. పెదపూడి విజయ్ కుమార్, కొరికాన రవికుమార్, వంపూరు గంగులయ్య, టి.సి. వరుణ్, ఆరణి మదన్‌లను నియమించారు.

 

పవన్ తన ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం ఈ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, చేరికల విధానాలు, విధివిధానాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్‌లోని చేరికలను పర్యవేక్షిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, ఏపీ తరహాలోనే త్వరలో తెలంగాణలో కూడా ప్రత్యేక ‘జాయినింగ్స్ కమిటీ’ని ఏర్పాటు చేసేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది.

Search
Categories
Read More
Telangana
కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల అందజేత.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్ మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం...
By Sidhu Maroju 2025-11-26 08:58:38 0 225
Andhra Pradesh
ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం **
*ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం* మార్కాపురం జిల్లా. పెద్ద దోర్నాల. మండల స్థానిక శివసదనంలో శంకర...
By Chennaiah Kati 2026-03-03 13:05:51 0 282
Andhra Pradesh
నారాయణ స్కూల్ నూతన భవన ప్రారంభ ఉత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
రాయచోటి పట్టణం మాసాపేట వరిగ రోడ్డులో ఈరోజు ఉదయం నూతన భవన ప్రవేశ మహోత్సవం లో పాల్గొన్న రాజంపేట...
By Benguluri Madhubabu 2026-03-08 12:51:03 0 210
Goa
Goa Emerges as India’s Premier Digital Nomad Hub
Panaji: Goa has officially cemented its status as the primary hub for India’s expanded...
By Dunna Jessicaruth 2026-05-14 07:10:06 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com