ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది

0
241

ఆదోని లో ముందస్తు అడ్మిషన్ల పేరుతో దోపిడీ చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని, DSF విద్యార్థి సంఘంగా డిమాండ్ చేశారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రోడ్డు మీద ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ.ఆదోని పట్టణంలో ప్రభుత్వా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలలో ముందస్తుగానే అడ్మిషన్లు నిర్వహిస్తూ అలాగే ప్రచారాలు చేస్తూ పాంప్లెట్లు ఫ్లెక్సీలు వేసి పబ్లిసిటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులకు విద్యార్థులకు మాయమాటలు చెప్పి మీరు ముందుగానే అడ్మిషన్ చేసుకుంటే మీకు ఫీజు తగ్గిస్తామని మాయమాటలు చెప్పి అడ్మిషన్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఆదోని పట్టణంలో ఏర్పడింది. ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలలో ఇంత అక్రమాలు జరుగుతున్న కూడా విద్యాశాఖ అధికారులు మరియు (RIO) గారు ఏం చేస్తున్నారని, డి.ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా అక్రమ ఫీజులను అరికట్టాలి. ముందస్తు అడ్మిషన్ల దోపిడీ పై విచారణ జరపాలి. విద్యార్థులకు తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతామని మరొక్కసారి ఉన్నత విద్యాశాఖ అధికారులకు హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు వరుణ్ రాజు తిక్క స్వామి కిరణ్ ఉమాపతి తదితరులు పాల్గొనడం జరిగింది.

Search
Categories
Read More
Telangana
బోనాల బాటలో బస్తీ బంధం..|
● అమ్మవారి దర్శనానికి రావాలని ఆహ్వానించిన బస్తీ నాయకులు ● కార్యక్రమంలో పాల్గొన్న పలువురు...
By Sidhu Maroju 2026-08-05 10:41:28 0 150
Telangana
శ్రీ బాలాజీ రాధాకృష్ణ మఠం భూమి, లీజును రద్దు చేయండి.
మేడ్చల్ మల్కాజిగిరి  జిల్లా/ అల్వాల్ అల్వాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-07-28 11:08:10 0 972
Telangana
గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
 ఐజేయు జిల్లా కార్యవర్గ సభ్యులు గొడుగు శ్రీనివాస్ గౌడ్   మహబూబాబాద్::కొత్తగూడ,...
By Bheeshman King 2025-12-21 14:14:39 0 353
Telangana
Yellow Alert ఈ జిల్లాలో వర్షాలు..,
భారత్ అవాజ్ న్యూస్: 19 జూలై రోజున వాతావరణం శాఖ వెలువడించడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లోని పలు...
By Gujile Ramu 2026-07-19 00:32:44 0 173
Andhra Pradesh
ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది: పవన్‌ కల్యాణ్‌.
    ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది:...
By Pagadala Venkateswar 2026-06-12 11:08:56 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com