"డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం”.. గాంధీ వద్ద కుటుంబ సభ్యుల ఆవేదన.|
Posted 2026-05-23 07:07:01
0
405
సికింద్రాబాద్ : గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
జియాగూడకు చెందిన పల్లవి గౌడ్(19) ఛాతిలో పెరిగిన గడ్డకు ఈ నెల 19న గాంధీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే ఆపరేషన్ అనంతరం ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి ఆమె మృతి చెందినట్లు సమాచారం.
పల్లవి బీఎస్సీ నర్సింగ్ సెకండియర్ చదువుతున్నట్లు తెలిసింది.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఘటనపై ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్న వైద్యులు.. నివేదిక వచ్చిన తరువాతే అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును ప్రారంభించిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును...
Harikishore V., IAS: Transforming Governance with Vision
The Journey Begins
"Good governance is not measured by the number of...
రుజువైతే మినిమమ్ 20 ఏళ్ళ జైలుశిక్ష!
ఇప్పుడు నమోదు చేసిన సెక్షన్స్ చాలా తీవ్రమైనవి. చట్ట ప్రకారం అరెస్ట్ తప్పదు. హై కోర్ట్ బెయిల్...
నిజామాబాద్
అబద్ధాల కాంగ్రెస్ సర్కారుపై రగులుతున్న జనాగ్రహం
అణగారిన వర్గాలకు, మహిళా లోకానికి తీరని ద్రోహం...
పెద్దపల్లి : గోదావరిఖనిలో స్కూల్ టీచర్ మృతి..!
గోదావరిఖని అడ్డగుంటపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు స్కూల్ టీచర్ వెన్నెల (30) దుర్మరణం...