కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కీలక సమావేశం

0
433

కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వ్యూహాలు, బీఎల్ఏల నియామకం, ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన, అలాగే నూతన పార్టీ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.

ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి నియోజకవర్గ ఎన్నికల కమిటీ ఇంచార్జ్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ , తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ సర్వీసెస్ చైర్మన్ మన్నె సతీష్ , కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మరియు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సమావేశంలో నాయకులు కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ముఖ్యంగా బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణం, బీఎల్ఏల నియామక ప్రక్రియ, ఎస్ఐఆర్ కార్యక్రమంపై స్పష్టమైన అవగాహన కల్పించారు. అలాగే త్వరలో ఏర్పాటు చేయనున్న పార్టీ కమిటీలలో చురుకైన కార్యకర్తలకు ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు తమ అభిప్రాయాలు, సూచనలు నాయకులతో పంచుకున్నారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేస్తామని, గ్రేటర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు

Search
Categories
Read More
Telangana
ఉప సర్పంచ్ కేదారి సాయం
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జూన్ 10 ఇటీవల రాజాపేట గ్రామంలో మరణించిన భోగ సత్తయ్య గారి కుటుంబానికి...
By Pindikura Mahesh 2026-06-10 15:56:15 0 434
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో శ్రీశాంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి
పుంగనూరులో ఆదివారం, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్...
By Kothuru Murali 2026-02-16 11:19:25 0 195
Telangana
నిజామాబాద్
రాబోవు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఈ రోజు 39 వ డివిజన్లో "స్పెషల్ టీమ్" ను ఏర్పాటుచేసి, కార్మికుల...
By Sadaq Sadaq 2026-06-06 10:16:18 0 161
Andhra Pradesh
సహకార సంస్థల అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా నూతనంగా నియమితులైన శ్రీ కుర్రా అప్పారావు సోమవారం గుంటూరు...
By John Baji 2025-12-30 01:20:59 0 251
BMA
Kerala Newsroom Trespassed, Staff Threatened
The Kochi offices of Asianet News were illegally trespassed by a group of 30...
By JoinBMA 2026-08-19 08:49:40 0 64
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com