"అల్వాల్‌లో యువతి మిస్సింగ్.. ప్రియుడిపైనే తల్లి అనుమానం.?

0
280

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం స్రవంతి నగర్‌లో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

స్రవంతి నగర్ ప్లాట్ నెంబర్ 419లో నివాసం ఉంటున్న కొత్తపల్లి మంజుల కుమార్తె సునీత (20) ఈ నెల 19వ తేదీ ఉదయం నుండి అకస్మాత్తుగా అదృశ్యమైంది. 

ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో తల్లి మంజుల స్నానానికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్న సునీత కనిపించకుండా పోయింది. యువతితో పాటు ఆమె బట్టలు, మొబైల్ ఫోన్ కూడా మాయమవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

బాధిత కుటుంబ సభ్యులు తమకు తెలిసిన ప్రాంతాలతో పాటు సొంత ఊరిలోనూ సునీత కోసం గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. 

అయితే, గతంలో సునీత తాను ప్రవీణ్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ యువతి తల్లి గురువారం సాయంత్రం అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, యువతిని సురక్షితంగా కనిపెట్టేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
79 మంది మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్లు మంజూరు
బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్, డిఎంఎసి చైర్మన్ సుమిత్ కుమార్ ఐఏఎస్ అధ్యక్షతన...
By Kothuru Murali 2026-04-16 17:15:32 0 153
Tamilnadu
Tamil Nadu Advances Biotechnology and Life Sciences Research
Tamil Nadu continues to strengthen its position as one of India's leading biotechnology and life...
By Fathima Safa 2026-06-29 09:59:48 0 92
Telangana
Dr B.R. Ambedkar birthday
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ....
By G k Nookala 2026-04-13 22:09:44 0 320
Andhra Pradesh
చందర్లపాడు లో ఘనంగా స్కూల్ రేడినెస్ మేళ
చందర్లపాడు లో ఘనంగా స్కూల్ రెడీనెస్ మేళ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు (మండలం ),...
By Patan Khuddus 2026-04-30 19:30:55 0 270
Andhra Pradesh
పేద విద్యార్థుల కోసం దాతలు ముందుకు రావాలి: విద్యాంజలి.
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల అభివృద్ధికి దాతలు 'విద్యాంజలి' కార్యక్రమంలో భాగస్వాములు...
By Pagadala Venkateswar 2026-02-18 10:38:28 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com