తల్లితండ్రులను దైవంగా భావించాలి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

0
398

 యువత తల్లిదండ్రులను దైవంలా భావించి వారి ఆశీస్సులతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని పేర్కొన్నారు. బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విద్యార్థి విభాగం సమీక్షా సమావేశంలో మాధవరం కృష్ణారావు మాట్లాడారు.

యువత నేడు అన్ని రంగాల్లో రాణిస్తూ తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రాజకీయ రంగంలోనూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం, నిబద్ధత చాలా ముఖ్యమని తెలిపారు. సమాజంలో ఎంతో మంది గొప్ప నాయకులు కష్టపడుతూ ఎదిగారని, తాను కూడా ఒక కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి ప్రజల ఆశీస్సులతో ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు.

కెసిఆర్  మరియు కేటీఆర్ నాయకత్వంలో బి ఆర్ ఎస్  పార్టీ యువతకు పెద్దపీట వేస్తోందని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునేలా యువతకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు.

అలాగే రాహుల్ గాంధీ తెలంగాణకు  వచ్చిన సమయంలో వేలాది ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువత మరియు ఉద్యోగులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. SIR పేరుతో ఓట్ల తొలగింపులపై యువత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కూకట్పల్లి నియోజకవర్గంలో జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 11 వేల మంది విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలతో కూడిన ఉచిత కిట్లు అందించామని గుర్తు చేశారు.

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత అందిపుచ్చుకోవాలని, తల్లిదండ్రుల మాట వినడం ద్వారా జీవితంలో మంచి మార్గంలో ముందుకు సాగవచ్చని ఎమ్మెల్యే సూచించారు. ఈ నెల 25 తేదీన  కేటీఆర్  అధ్యక్షతన జరిగే బి ఆర్ ఎస్  పార్టీ కార్యకర్తల సమావేశానికి భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, విద్యార్థి విభాగ ప్రతినిధులు, సోషల్ మీడియా వారియర్స్ మరియు వివిధ విభాగాల బాధ్యులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
" ప్రజావాణిలో ప్రజా సమస్యలపై శాంతి శ్రీనివాస్ రెడ్డి చర్చ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :ఆల్వాల్  మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్,...
By Sidhu Maroju 2026-04-13 09:18:00 0 313
Andhra Pradesh
 హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని 
 హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని  తేదీ 3-01-2026 అనగా శనివారం రోజున...
By Gadiyapudi Narendra 2025-12-26 14:58:42 0 802
Andhra Pradesh
Boyakonda: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం ఆషాడ మాసం మొదటి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.
బోయకొండ: ఆషాడ మాసం మొదటి ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ...
By Pagadala Venkateswar 2026-07-20 11:30:33 0 115
Telangana
బి ఆర్ ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ సభ్యత్వం నమోదు ప్రక్రియపై ఫోకస్.....!
సభ్యత్వ నమోదుపై కేసీఆర్ ఫోకస్ భరత్ అవాజ్ న్యూస్: 13 మే నేడు తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదును...
By Gujile Ramu 2026-05-13 00:34:05 0 194
SURAKSHA
AP పోలీసులు నేడు: మహిళలకు శక్తి ఇచ్చే దిశగా
నేడు AP పోలీసులు రాష్ట్రమంతటా మహిళా సాధికారత కార్యక్రమాలు చేశారు. 1200+ మంది అమ్మాయిలు, మహిళలకు...
By Kalaga Sailaja 2026-07-04 09:32:43 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com