Boyakonda: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం ఆషాడ మాసం మొదటి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.

0
114

బోయకొండ: ఆషాడ మాసం మొదటి ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

 

బోయకొండ శక్తి క్షేత్రంలో భక్తులు పోటెత్తారు రాష్ట్రం తో పాటు కర్ణాటక తమిళనాడు ల నుంచి ఉదయాన్నే అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనార్థం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు గంగాపురం నుంచి అమ్మవారి సన్నిధానం వరకు ఎక్కడ చూసినా భక్త జన సందోహం కనిపించింది.

 

రణభేరి గంగమ్మ ఆలయం నుంచి అమ్మవారి పుష్కరిణి వరకు ఎక్కడపడితే అక్కడ వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం వాటిలింది క్యూలైన్లు సన్నిధానం పెద్ద భోగం చిన్న భోగం కార్యాలయ సముదాయం వంటి ప్రాంతాలలో ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం పర్యవేక్షించారు.

 

భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు క్యూ లైన్ లలో పలు చోట్ల ప్రక్షాళన చేయడం వల్ల సాధారణ భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం సులభంగా జరిగింది ఆలయ పరిసర ప్రాంతాలు వాహన రాకపోకలు అంతరాయం వాటిల్లకుండా ఎస్సై చిన్న రెడ్డప్ప బందోబస్తు చర్యలు తీసుకున్నారు.

 

మదనపల్లి నుంచి పలువురు చిన్నారులు తరలివచ్చి అమ్మవారి ఆలయంలో కోలాటలు వేశారు ఈ కార్యక్రమం యాత్రికులను అలరించింది ఆలయ అధికార అర్చక సిబ్బంది భక్తులకు సేవలు అందించారు.

Search
Categories
Read More
SURAKSHA
Shri Dinesh Kumar Muhal: A Rising Star in Public Service
A young 2023-batch AGMUT cadre IAS officer, Shri Dinesh Kumar Muhal is serving as Resident Deputy...
By Lokeshwari Panthadi 2026-07-27 07:36:07 0 199
Telangana
సూర్యనగర్‌లో హత్య.|
● ఆరు నెలల గర్భిణి దారుణ హత్య ● భర్తే గొంతు నులిమినట్లు అనుమానం ● ఘటనపై అల్వాల్ పోలీసుల...
By Sidhu Maroju 2026-09-14 16:58:21 0 113
Andhra Pradesh
‘డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలి’
డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి మండలం కొత్తవలసలో అభ్యుదయం...
By Boiena Rajesh 2026-08-11 03:58:09 0 121
Andhra Pradesh
పేదల కష్టాల్లో ప్రభుత్వము సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
పేదల కష్టాల్లో ప్రభుత్వం అండగా… సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ దర్శి టిడిపి కార్యాలయంలో...
By Chennaiah Kati 2026-06-24 15:24:18 0 95
SURAKSHA
Sweta Mohanty IAS: Championing Public Health Leadership
A distinguished Telangana IAS officer whose leadership in district administration, healthcare...
By Lokeshwari Panthadi 2026-07-15 06:54:29 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com