Palamooru rangareddy project

0
194

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. దీనితో పాటు జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల విషయంలో కూడా భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.

 

❇️ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో సమావేశమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కీలకమైన సూచనలు చేశారు.

 

❇️ జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. పెండింగ్ బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

 

❇️ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. 

 

❇️ ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి గారు, జి. మధుసూదన్ రెడ్డి గారు, టి. మేఘా రెడ్డి గారు, కె. రాజేశ్ రెడ్డి గారు, వంశీకృష్ణ గారు, వీర్లపల్లి శంకరయ్య గారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల మండలం సూర్యలంక సముద్ర ప్రాంతంలో అభివృద్ధి పనుల పురోగతిని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పరిశీలించారు
బాపట్ల మండలం సూర్యలంక సముద్ర ప్రాంతంలో అభివృద్ధి పనుల పురోగతిని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ...
By Gadiyapudi Narendra 2026-01-09 15:38:21 0 520
Telangana
భారీ వర్షాల వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన బిఆర్ఎస్ మాజీ మంత్రులు
సికింద్రాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముంపుకు గురైన రాంగోపాల్ పేట్ లోని పలు...
By Sidhu Maroju 2025-09-21 07:00:06 0 338
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: లో విచిత్ర వాతావరణం
పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో ఆదివారం మధ్యాహ్నం విచిత్ర వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి...
By Kothuru Murali 2026-05-17 17:34:00 0 119
Andhra Pradesh
వృద్ధాశ్రమానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ భారీ విరాళం – రూ.50 లక్షల మంజూరు
కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సామాజిక సేవలో మరో ముందడుగు వేశారు. పెద్దాపురం మహారాణి కళాశాల...
By Ratna Sekhar 2026-02-19 19:13:06 0 1K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో ఓ మోస్తరుగా వర్షం
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారి, ఓ మోస్తరు వర్షం కురిసింది....
By Kothuru Murali 2026-05-01 11:40:58 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com