మచిలీపట్నంలో మైనర్ బాలికపై అసభ్యకరమైన ప్రవర్తన కేసుకు సిద్ధమైన పోలీసులు

0
167

మచిలీపట్నంలో మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన.. ఫోక్సో కేసుకు సిద్ధమైన పోలీసులు

 

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాలను బాలిక రెండు రోజుల తర్వాత తన తల్లికి చెప్పడంతో విషయం బయటపడింది.

పోలీసుల వివరాల ప్రకారం.. మచిలీపట్నం నిజాంపేట ప్రాంతంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై ఇంటి యజమాని అల్లుడు కొన్ని రోజులుగా వేధిస్తున్నట్లు సమాచారం. బాలికను మాయ మాటలతో లొంగదీసుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక పట్ల అతడు అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అయితే బాలిక అతడి చెర నుంచి తప్పించుకుని బయటకు పరుగులు తీసింది. జరిగిన విషయాన్ని బాలిక శుక్రవారం తన తల్లికి వివరించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.

తల్లి వెంటనే చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో రంజాన్ శుభాకాంక్షలు: మత సామరస్యానికి ప్రతీకగా నాయకులు.
మదనపల్లెలో రంజాన్ పండుగ సందర్భంగా శనివారం పలువురు నాయకులు మత సామరస్యానికి ప్రతీకగా శుభాకాంక్షలు...
By Pagadala Venkateswar 2026-03-21 11:26:31 0 216
SURAKSHA
Neeraj K. Pawan: Transforming Rajasthan Through Vision
Introduction (The Hook) "The true measure of governance lies in how...
By Fathima Safa 2026-07-21 07:03:40 0 164
Telangana
ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026కు ‎బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం
మార్చి 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక 'ఇండియా టుడే కాన్‌క్లేవ్'...
By Ponnala Srinivasrao 2026-03-10 05:35:22 0 329
Andhra Pradesh
ఎంపీ కేశినేని శివనాద్ సారధ్యంలో మహిళలకు ఎస్ఐఆర్డీలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
*ప్ర‌చుర‌ణార్థం* *15-12-2025*   తేనె, వర్మి, ప్రకృతి సాగుతో ఎస్.హెచ్.జి...
By Rajini Kumari 2025-12-16 07:32:03 0 222
SURAKSHA
K. Biju, IAS: Leading Kerala with Vision and Integrity
The Journey Begins "True leadership in public administration is measured by the positive...
By Fathima Safa 2026-07-15 14:00:57 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com