కొంత ప్రైవేటీకరణతో ఆర్టీసీకి ఊరట ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ

0
160

Avja కృష్ణా 

 

కొంత ప్రైవేటీకరణతోనే ఆర్టీసీకి ఊరట: ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ 

 

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి అని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ స్పష్టం చేశారూ ... కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సబ్సిడీ ఇస్తున్నప్పటికీ, ఒక్కో బస్సు ధర సుమారు రూ. 1.60 కోట్ల నుండి రూ. 1.70 కోట్ల వరకు పలుకుతోందని తెలిపారు.

ఇంత పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి బస్సులను కొనుగోలు చేయడం ప్రస్తుతానికి ఆర్టీసీ లేదా ప్రభుత్వానికి సాధ్యం కాని పని అని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి బదులుగా బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తే, వారే పెట్టుబడులు పెట్టి, బాడీ బిల్డింగ్ చేయించుకుని బస్సులను నడుపుతారని, దీనివల్ల ఆర్టీసీపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని వివరించారు.

ఆర్థిక భారం.. ఎలక్ట్రిక్ బస్సుల ఆవశ్యకత

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 10వేల బస్సులు నడుస్తున్నాయని, వాటన్నింటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలంటే దాదాపు రూ. 15, వేల కోట్లు అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల ఆర్టీసీపై ఇప్పటికే ఆర్థిక భారం పెరిగిందని, ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆపరేటర్ల భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు.

అయితే, ప్రయాణికులకు ఛార్జీలు పెంచే ఆలోచన ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. డీజిల్ బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఖర్చు చాలా తక్కువని ఆయన వివరించారు

ఎలక్ట్రిక్ బస్సుల వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా, నిర్వహణ వ్యయం తగ్గి ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. రాబోయే రెండు నెలల్లో ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయనీ చెప్పారు

Search
Categories
Read More
Andhra Pradesh
In A P Guntur Lalitha avs hospital
[03/06, 1:30 pm] null: గుంటూరు నగరంలో అత్యాధునిక వైద్య సేవలకు కొత్త కేంద్రంగా నిలిచిన 'లలితా...
By G k Nookala 2026-06-03 08:37:33 0 328
BMA
Editors Guild Slams Disenfranchisement of Ex-Editor
The Editors Guild of India has strongly condemned the bureaucratic harassment of R. Rajagopal,...
By JoinBMA 2026-09-10 04:45:35 0 136
Andhra Pradesh
రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని వ్యక్తి దేవినేని అవినాష్ రాష్ట్ర అధికారి పొట్లూరి దర్శిత్
*ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*   *రాజకీయ అవగాహన లేని వ్యక్తి వైసిపి జిల్లా...
By Rajini Kumari 2026-03-06 01:48:04 0 213
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా గంజాయి తోటలపై దాడి 460 మొక్కలు స్వాధీనం, నలుగురు అనుమానితుల అదుపు
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే...
By Chunarkar Jagadeesh 2026-09-05 16:42:43 0 383
Andhra Pradesh
హనీ గ్యాంగ్ మా ఊరిలో గుప్త నిధులు ఎత్తుకు పోయింది: స్థానికుడు.
మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీకి చెందిన పొత్తూరు మోహన కృష్ణమ నాయుడు అలియాస్ మధుశ్రీ, హనీ గ్యాంగ్ తనను...
By Pagadala Venkateswar 2026-06-06 05:36:09 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com