తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఎవరి సభ చూసినా టార్గెట్ బిఆర్ఎస్

1
186

ప్రతిపక్షం అంటే ప్రజల సమస్యలపై పోరాడటం కావాలి…

‎కానీ తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.

‎ఎవరి మాట విన్నా… ఎవరి సభ చూసినా… ఎవరి విమర్శ విన్నా…

‎ఒక్క పేరే ఎక్కువగా వినిపిస్తోంది — బిఆర్ఎస్.

‎‎బీజేపీ టార్గెట్… బిఆర్ఎస్

‎కాంగ్రెస్ టార్గెట్… బిఆర్ఎస్

‎చిన్న పార్టీలు… పెద్ద పార్టీలు…

‎కొత్తగా వచ్చిన నాయకులు…

‎యూట్యూబ్ రాజకీయ విశ్లేషకులు…

‎అందరి చర్చలో కూడా బిఆర్ఎస్‌నే కేంద్రబిందువు.

‎ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ ఒక సాధారణ పార్టీ కాదు…

‎ఒక ఉద్యమ చరిత్ర.

‎ఒక భావోద్వేగం.

‎ఒక ఆత్మగౌరవ ప్రతీక.

‎తెలంగాణ కోసం వేల మంది పోరాడిన సమయంలో

‎అవమానాలు, అరెస్టులు, విమర్శలు ఎదుర్కొంటూ

‎ఒక మనిషి మాత్రం వెనక్కి తగ్గలేదు.

‎ఆ మనిషే కేసీఆర్ గారు.

‎తెలంగాణ సాధ్యం కాదు అన్నారు…

‎అసెంబ్లీలో నవ్వారు…పార్లమెంట్‌లో అడ్డుకున్నారు…

‎అయినా తన మాట మార్చకుండా, తన లక్ష్యం వదలకుండా

‎ఒక్కడే సింహంలా పోరాడిన నాయకుడు కేసీఆర్ గారు.

‎అందుకే ఈరోజు కూడా రాజకీయాల్లో ఎవరికైనా ఎదగాలి అంటే ముందుగా బిఆర్ఎస్‌ను విమర్శిస్తారు.

‎ఎందుకంటే బలమైన చెట్టుకే ఎక్కువ రాళ్లు పడతాయి.

‎గుంట నక్కలు అన్నీ గుంపుగా రావచ్చు…

‎కానీ సింహం మాత్రం సింగిల్‌గానే వస్తుంది.

‎అది గర్జిస్తే అడవి మొత్తం వినిపిస్తుంది.

‎అదే విధంగా ఎన్ని కుట్రలు జరిగినా…

‎ఎన్ని విమర్శలు వచ్చినా… ఎన్ని పార్టీలు ఒక్కటైనా…

‎తెలంగాణ ప్రజల గుండెల్లో ఉద్యమ జ్ఞాపకాలతో నిలిచిన పేరు మాత్రం కేసీఆర్ మరియు బిఆర్ఎస్ పార్టీ.

‎ఎందుకంటే కొన్ని పార్టీలు ఎన్నికల కోసం పుడతాయి…

‎కానీ కొన్ని ఉద్యమాల నుంచి పుడతాయి.

‎బిఆర్ఎస్ అలాంటి ఉద్యమ శక్తి.

Search
Categories
Read More
Telangana
అగ్నివీర్ తాండా యువకుడు
రామయంపేట మండలం పర్వతాపూర్ పరిధిలోని బాపనయ్య తాండాకు చెందిన విస్లావత్ అనిల్ కుమార్ భారత సైన్యంలో...
By Katiyala JeevanRaj 2026-06-03 12:51:51 0 340
Gujarat
Gujarat Strengthens Education and Health Infrastructure Growth
Gujarat is making significant progress in strengthening its education and health infrastructure...
By Fathima Safa 2026-06-29 12:42:29 0 118
Andhra Pradesh
రాముడు రామాయణం గురించి పిల్లలకు చెప్పండి తిరుపతి సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు నాయుడు
*Tirupathi*   *మన పురాణ పురుషుల గురించి యువతకు, పిల్లలకు చెప్పండి...రాముడు..రామరాజ్యం...
By Rajini Kumari 2025-12-26 10:14:51 0 296
Andhra Pradesh
మదనపల్లెలో చీటీల మోసం పై పీజీఆర్ఎస్ ఫిర్యాదు.
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, చీటీల పేరుతో స్థానికుల నుంచి...
By Pagadala Venkateswar 2026-02-10 04:48:32 0 195
Andhra Pradesh
పుంగనూరు :కొత్త ఇండ్లు వద్ద ద్విచక్ర వాహనం చోరీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు పట్టణంలో కొత్త ఇండ్ల టీవీఎస్ షోరూమ్ వద్ద ఎన్....
By Kothuru Murali 2026-01-12 08:41:36 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com