ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ.

0
124

ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ

15-05-2026 Fri 08:14 | Andhra

AP Government New Pension Scheme for Chronic Diseases

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఏపీ ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు

మొదటి విడతలో 965 మందికి నెలకు రూ.10 వేల చొప్పున సాయం

జూన్ 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ

పక్షవాతం, కండరాల వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.15 వేల పింఛను

జూన్ నెల నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ

ఏపీ ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వేలాది మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా మొదటి విడతలో 965 మందికి జూన్ 1 నుంచి నెలకు రూ.10,000 చొప్పున పింఛను అందించనుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ఈ పింఛను డబ్బులను పంపిణీ చేయనున్నారు.

 

గతేడాది మార్చి తర్వాత కిడ్నీ, లివర్, గుండె సంబంధిత వ్యాధులతో పాటు బోదకాలు, కుష్టు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 965 దరఖాస్తులు రాగా, వాటన్నింటినీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ కొత్త పింఛన్ల కోసం నెలకు రూ.93.34 లక్షల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇకపై దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల నుంచి దరఖాస్తులు వచ్చిన వెంటనే, వైద్యారోగ్య శాఖ ఆమోదంతో ఏ నెలకు ఆ నెలలోనే పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పక్షవాతంతో మంచానికే పరిమితమైన వారు, కండరాల బలహీనత, తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, తీవ్రమైన హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడేవారిని దివ్యాంగుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ కేటగిరీల కింద ఏపీలో 2025 మార్చి తర్వాత 1,217 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి పింఛను మంజూరు కావాలంటే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ సర్టిఫికెట్ జారీ అయిన మరుసటి నెల నుంచే వీరికి పింఛను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

ఈ కేటగిరీలో పింఛన్ల మొత్తంలో కూడా వ్యత్యాసం ఉంది. తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10,000 అందిస్తారు. అదే సమయంలో పక్షవాతంతో పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి, తీవ్రమైన కండరాల వ్యాధులతో బాధపడేవారికి నెలకు రూ.15,000 చొప్పున పింఛను ఇవ్వనున్నారు. మరోవైపు అర్హులైన ఇతరుల కోసం జూన్ నెల నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Search
Categories
Read More
Telangana
పేకాట పై పోలీసులు మెరుపు దాడి
- పేకాటపై పోలీస్ మెరుపు దాడి.. - నలుగురు పేకాటరాయుల్ల అరెస్ట్.. - రూ.6500 నగదు, నాలుగు సెల్...
By Nookapangu Manikanta 2026-05-12 15:31:13 0 185
Andhra Pradesh
Nara Lokesh: వైసీపీ విష ప్రచారాలను తిప్పికొట్టండి.
Nara Lokesh: వైసీపీ విష ప్రచారాలను తిప్పికొట్టండి: నారా లోకేష్ ndhra. Nara Lokesh Urges TDP to...
By Pagadala Venkateswar 2026-01-31 06:57:18 0 265
Assam
Assam’s GI Products Go Global: Tezpur Litchi Hits Dubai
Following the successful direct export of GI-tagged Tezpur Litchi to Dubai, Assam's Department of...
By Lokeshwari Panthadi 2026-06-26 13:20:17 0 151
Andaman & Nikobar Islands
పుంగునూరు నియోజకవర్గం :బోయకొండ గంగమ్మ దర్శనానికి భక్తజన సందోహం
చిత్తూరు జిల్లా పుంగనూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం ఆదివారం భక్తులతో...
By Kothuru Murali 2026-07-26 14:31:18 0 188
SADHANA
Landmark Study Links Hyper-Flexible Hybrid Schooling to High Graduation Rates
A multi-country longitudinal report released by the International Education Bureau reveals that...
By Dunna Jessicaruth 2026-05-20 06:16:23 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com