రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు-2026

0
221

రెవెన్యూ ఉద్యోగులు క్రీడల పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎపిఆర్ఎస్ఏ అధ్యక్షులు కె. శ్రీరాములు గురువారం పిలుపునిచ్చారు. ఐకమత్యమే మహాబలం - రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసుల సంఘం, శ్రీకాకుళం జిల్లా శాఖ, జిల్లాలోని అందరు రెవెన్యూ ఉద్యోగులకు ఆఫీస్ సబోర్డినేట్ నుండి డెప్యూటీ కలెక్టర్ వరకు,అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, సర్వే ఉద్యోగులు, గణాంకాధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులు ఈ నెల 27, 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు జరిగే శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలులో పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు.

 

దాదాపు ఎనిమిది సంవత్సరాల (2018 నుండి ఇప్పటి వరకు) తరువాత, ఈ సంవత్సరం 2026లో ఈ కార్యక్రమం, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్,, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోజువారి విధుల్లో రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఒత్తిడి నుండి కొంత మేర ఉపశమనం కలిగించేందుకు దోహద పడతాయనే సదుద్దేశంతో ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం, ఆత్మస్థైర్యం, మానసిక ఉల్లాసం, ఉద్యోగుల ఐక్యత పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.

 

శుక్రవారం ఉదయం 7 గంటలకు స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియం వద్దకు చేరుకోవాలని కోరుతూ, జిల్లా రెవిన్యూ క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలియజేస్తూ, ఉద్యోగులందరికీ ఈ మూడు దినములలో భోజన సదుపాయాలు కల్పించడం జరిగినదని తెలుపుతూ, ఆఖరి రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. రెవిన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై ఈ రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను పండగలా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసుల సంఘం తెలిపింది.

Search
Categories
Read More
Telangana
అరుంధతి ఆసుపత్రిలో ఉచిత వైద్యసేవలు -పరిశీలించిన నియోజక వర్గ నాయకులు.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి ...
By Sidhu Maroju 2025-11-26 10:08:26 0 235
SURAKSHA
S. D. Singh Jamwal IPS: Leading Ladakh with Courage
The Journey Begins "A police officer's greatest achievement is not measured by...
By Fathima Safa 2026-07-23 12:50:30 0 111
Andhra Pradesh
వినాయక మండపాలను సందర్శించిన ప్రభుత్వ విప్ గణబాబు
వినాయక చవితి సందర్భంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక...
By Santhosh Kumar 2026-09-14 08:23:48 0 122
Andhra Pradesh
చేప పిల్లలు విడుదల చేసిన టిడిపి మండలాధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు
Tసుండుపల్లి మండలం పెద్దినేని కాలు గ్రామపంచాయతీ బండ కాడ ఈడిగపల్లె యెహోవాను ఉన్న అత్తా కోడలు...
By Benguluri Madhubabu 2026-03-10 14:15:39 0 242
Andhra Pradesh
యువతకు భరోసా టీడీపీ పాలనలోనే సాధ్యం ఐటిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడు
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించిన పదివేల 600 ఉద్యోగాలతో కూడిన మెగా జాబ్...
By Benguluri Madhubabu 2026-03-20 11:13:09 0 274
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com