ఎవరబ్బా... హైదరాబాద్ లో అంత మొనగాడు... ఆసుపత్రి కట్టి ఏకంగా ప్రధాని నరేంద్రమోడీని పిలిచి ప్రారంభోత్సవ బటన్ నొక్కించింది?

0
118

తెలంగాణ ప్రజలకు అంకితం 

‎ఇది బండి పార్ధసారధి రెడ్డి విజయం 

‎సాయి సింధు క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 

‎ఎవరబ్బా... హైదరాబాద్ లో అంత మొనగాడు... ఆసుపత్రి కట్టి ఏకంగా ప్రధాని నరేంద్రమోడీని పిలిచి ప్రారంభోత్సవ బటన్ నొక్కించింది? ఎవరు సాయి సింధు ఓనర్లు అంటూ గూగుల్ సెర్చ్ జోరుగా సాగింది! అది ఎవరిదో కాదు... దాని వెనుక ఉన్నది హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ అధినేత, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్ధసారధి రెడ్డి! 

‎హెటెరో గ్రూప్ చైర్మన్ డాక్టర్ బండి పార్ధసారధి రెడ్డి గారు BRS రాజ్యసభ సభ్యులు! వారి కుమార్తె పేరు కృష్ణ సింధూరి " దివంగత సింధూరి పేరిట ఆమె జ్ఞాపకార్ధం హైటెక్ సిటీలో సాయి సింధు కార్పొరేట్ ఆసుపత్రి నిర్మించారు. ఇది క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి! 

‎నిజానికి ఈ ఆసుపత్రి నిర్మాణం వెనుక పూర్వ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చొరవ ప్రోత్సాహం వుంది! ఖానామెట్ లో 15 ఎకరాల భూమిని 2018లో కెసిఆర్ కేటాయించారు. దాదాపు 300 కోట్ల భూమి అది! కేవలం సంవత్సరానికి 147 లక్షల అద్దెతో 33 ఏళ్ళు సాయి సింధు ఫౌండేషన్ కు అప్పగించింది అప్పటి కెసిఆర్ ప్రభుత్వం! అయితే తద్వారా BRS పార్టీకి పెద్ద మొత్తంలో ఎలక్టోరల్ బాండ్లు అందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ, ఎంత వరకు నిజమో తెలియదు! మొత్తానికి ఆ పార్టీ బండి పార్ధసారధి రెడ్డిని రాజ్యసభ సీటులో కూర్చోబెట్టింది! అది వేరే కథ! 

‎కాగా, 2023లో ఈ భూముల లీజు చట్ట విరుద్ధం అని హైకోర్టు సంబంధిత జివోను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది! తిరిగి ప్రభుత్వం పరిశీలించాలని అప్పట్లో తీర్పు ఇచ్చింది. తీర్పు ఆధారంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే, ఈ భూముల కేటాయింపు రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. అప్పట్లో కెసిఆర్ సమర్థించుకున్నారు, అది వేరే కథ! 

‎రేవంత్ రెడ్డి 2024లో ముఖ్యమంత్రి అయ్యేనాటికే ఆ భూముల్లో సాయి సింధు ఫౌండేషన్ ఆసుపత్రి 76 శాతం నిర్మాణం పూర్తి చేసుకుంది! మరి ఏం జరిగిందో తెలియదు కానీ, అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ఫౌండేషన్ కు లీజు ఖరారు చేస్తూ GO.37 జారీ చేసింది! అది వేరే కథ! 

‎కట్ చేస్తే, అదే ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసుకుంది! ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించింది! భూములు రద్దు చేస్తానని ఎన్నికల ముందు ప్రకటించి, అధికారంలోకి రాగానే అదే భూములను తిరిగి లీజుకు ఇచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిందో లేదో తెలియదు కానీ ఆయన హాజరు కాలేదు! ప్రధాని మోడీ నిన్న ఆదివారం ఆసుపత్రిని ప్రారంభించారు! అసలు ఈ ఆసుపత్రికి పునాది వేసిన BRS అధినేత కెసిఆర్ ను కానీ, యువ నేత కెటిఆర్ ను కానీ పిలవలేదు! పిలిచినా వారు రాలేదేమో తెలియదు! అది వేరే కథ! 

‎ఇక్కడ విశేషం ఏమిటంటే... BRS విలువైన భూములు ఆసుపత్రికి కేటాయించింది! అవే భూములను కాంగ్రెస్ ప్రభుత్వం లీజు ఖరారు చేసింది. BJP నేత ప్రధాని మోడీ ప్రారంభించారు! మూడు పార్టీలతో పని పూర్తి చేయించుకున్న ఘనత డాక్టర్ బండి పార్ధసారధి రెడ్డి గారిది! అదీ అసలు కథ! 

‎బండి పార్ధసారధి రెడ్డి సొంతూరు కందుకూరు! ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలో వుంది! సత్తుపల్లిలో విద్యాభ్యాసం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ లో పిజి చేసి పిహెచ్.డి చేశారు. హెటెరో డ్రగ్స్ సంస్థను స్థాపించి దాదాపు ఏడు వేల మందికి ఉపాధి కల్పించారు. మరోవైపు విద్యా సంస్థలు స్థాపించారు. ఇప్పుడు ఆసుపత్రి రంగంలోకి ప్రవేశించారు. 2019లో టిటిడి పాలకమండలి సభ్యులు గా నియమితు లయ్యారు. 2022లో రాజ్యసభ సభ్యులు అయ్యారు! 2024లో ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన అత్యంత ధనవంతుల భారతీయుల జాబితాలో 39,200 కోట్ల విలువ కలిగిన నికర ఆస్థులతో 81వ స్థానంలో నిలిచారు డాక్టర్ బండి పార్ధసారధి రెడ్డి! 

‎హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచంలోనే పేరు పొందిన ఇండియా ఫార్మాస్యూటికల్ గ్రూప్ హెటెరో డ్రగ్స్ లిమిటెడ్, హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్! హెల్త్ కేర్, బయోఫార్మా, జెన్ ఎక్స్ ల్యాబోరేటరీస్ అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. యాంటీ రెట్రో వైరల్ ఔషధాలు ఉత్పత్తి చేసే అతి పెద్ద సంస్థ ఇది! యాక్టీవ్ ఫార్మస్యూటీకల్స్ ఇంగ్రీడియంట్స్ తయారీలోనూ పెరుగాంచిన సంస్థ! 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుంగనూరు మండలం బారాడపల్లికి చెందిన చైతన్య(27),...
By Pagadala Venkateswar 2026-05-20 13:48:01 0 84
SURAKSHA
Nivedita Lairenlakpam, IAS: Inspiring Manipur's Progress
A dedicated IAS officer whose commitment to transparent governance, citizen-centric...
By Lokeshwari Panthadi 2026-07-22 09:21:56 0 43
Andhra Pradesh
ప్రేమ వివాహ జంటను వేరు చేశారని ఎస్పీకి ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లా, ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లెకు చెందిన ముక్కండ్ల వినోద్ కుమార్, కొత్తకోట...
By Pagadala Venkateswar 2026-03-27 04:04:49 0 150
Telangana
"పరీక్షకు వెళ్లిన యువకుడికి షాక్… పార్క్ చేసిన బైక్ మాయం.|
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, అల్వాల్ పరిధిలో బైక్ దొంగతనం ఘటన చోటుచేసుకుంది. 08-04-2026...
By Sidhu Maroju 2026-04-08 15:09:26 0 269
Andhra Pradesh
Nara Lokesh: విద్యార్థులకు శుభవార్త చెప్పిన మంత్రి నారా లోకేశ్.
ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫీజు...
By Pagadala Venkateswar 2026-02-11 07:53:41 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com