కొండ ప్రాంత ప్రజలకు అండగా ఉంటాం కేసినేని చిన్ని

0
192

*ప్రెస్ నోట్*

 

9-5-2026

 

*కొండ ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటాం*

 

 

*విజయవాడ కొండ ప్రాంతాల ప్రజలకు ఎంపీ చిన్ని శుభవార్త*

 

*ఎమ్మెల్యే ఎంపీస్ మీట్లో జీవో నెంబర్ 30 పై సీఎం కీలక ప్రకటన*

 

*మూడు నెలల్లో కొండ పోరంబోకు ప్రాంతాల్లో స్థలాలు రెగ్యులరైజేషన్ పై జిల్లా యంత్రాంగానికి కీలక ఆదేశాలు*

 

*సీఎంతో జరిగిన మీటింగ్ వివరాలు తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని*

 

 

విజయవాడ( ఎంపీ కార్యాలయం) విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రకటన చేశారు. కొద్ది రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యే ఎంపీస్ మీట్లో జీవో నెంబర్ 30 పై జరిగిన కీలక విషయాలను తెలియజేశారు.

 

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ముందుగా విజయవాడ నగర వాసులు శుభవార్త తెలియజేశారు.కొద్ది రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యే ఎంపీ ల సమావేశంలో జీవో నెంబర్ 30 ద్వారా 150 గజాల స్థలాన్ని రెగ్యులర్ చేయమని సీఎంను కోరినట్లు తెలిపారు. దీనికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ వెంటనే అధికారులకు సూచనలు చేయడం జరిగింది.మూడు నెలల్లోని కొండ ప్రాంతాల పోరంబోకు ప్రభుత్వ స్థలాలు లో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

 

కొండ ప్రాంతాల్లో నివసించే వారు విజయవాడలో ఎక్కువగా తూర్పు నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్నారని అలాంటి వారికి ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త అని తెలియజేశారు.కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని ఇది చేతల ప్రభుత్వమని మరొకసారి నిరూపణ అయిందని ఎంపీ అన్నారు.ఎన్నో ఏళ్లుగా కొండ ప్రాంతాల్లో ఉన్న వారిని ఓటు బ్యాంకు గానే చూసిన పార్టీలు ఉన్నాయి కానీ వారిని ఆదుకున్నది మాత్రం కేవలం కూటమి ప్రభుత్వమేనని ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని ఎంపీ అన్నారు. త్వరలోనే 30 వేల మంది చిరకాల కోరిక సొంత ఇంటి కలను నెరవేర్చబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రైవేట్ ఆస్పత్రులే టార్గెట్ – మదనపల్లెలో దొంగ సంచలనం.
మదనపల్లెలో అర్ధరాత్రి వేళ ఆస్పత్రుల్లోకి చొరబడి క్యాష్ పెట్టెల్లోని డబ్బును దొంగిలించే ప్రయత్నాలు...
By Pagadala Venkateswar 2026-03-22 06:13:50 0 213
BMA
Drone Journalists Targeted: The New Frontline Risk
The evolution of drone journalism has introduced entirely new risks for media operators capturing...
By JoinBMA 2026-08-20 04:57:14 0 258
Telangana
గ్రామ పంచాయతీలకు.. నిధులు విడుదల
*రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం తీపికబురు అందించింది. సంక్రాంతి పండుగను...
By CM_ Krishna 2026-01-14 05:00:14 0 406
Andhra Pradesh
పశ్చిమ వాడవాడల్లో జగనన్న జన్మదిన వేడుకలు
విజయవాడ 21-12-2025   ప్రచురణార్ధం   *పశ్చిమలో వాడ వాడ ల జగనన్న జన్మదిన వేడుకలు*...
By Rajini Kumari 2025-12-21 12:20:53 0 264
Andhra Pradesh
పీటీఎం: మిద్దెపై నుంచి జారిపడి బాలికకు తీవ్ర గాయాలు.
పీటీఎం మండలంలో సోమవారం, బొంతవారిపల్లెకు చెందిన వెంకట్రమణ కుమార్తె స్వాతి (12) మిద్దెపై పూలు...
By Pagadala Venkateswar 2026-05-26 06:34:31 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com