* ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య*

1
664

*ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య*

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యతారాహిత్యం ఒక నిండు సంసారాన్ని బలి తీసుకుంది. తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని నేషనూరు అనే గ్రామానికి చెందిన పద్మ (28) అనే వివాహిత తన ఇద్దరు కుమార్తెలకు (6, 5 ఏళ్లు) ఉరేసి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. 2019లో తల్లిదండ్రులను ఎదిరించి తన డిగ్రీ క్లాస్ మేట్ అయిన శివశంకర్‌ అనే యువకుడిని పద్మ పెళ్లి చేసుకుంది. అయితే ఆ తర్వాత తన భర్త పనికి వెళ్లకుండా జులాయిగా తిరుగుతూ అప్పులు చేయడం, కనీసం పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె కూడా కట్టకపోవడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో "తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం ఓ గుణపాఠం. ఊరంతా అప్పులు చేసి, తీర్చలేనంటే.. నేనేం చేయాలి. ఇక ఉంటా! నేను చనిపోయాక ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు, ఈ సారైనా లైఫ్ సెటిల్ అయ్యాక చేసుకో" అంటూ లేఖ రాసి తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, తానూ ఉరి వేసుకుంది. భర్త శివశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ
బాపట్ల జిల్లా: మంగళవారం బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా...
By Gadiyapudi Narendra 2026-02-17 15:57:29 0 234
Andhra Pradesh
Chandrababu Naidu: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై సీఎం చంద్రబాబు స్పందన.
Andhra Chandrababu Naidu welcomes India US trade deal భారత్, అమెరికా మధ్య చరిత్రాత్మక వాణిజ్య...
By Pagadala Venkateswar 2026-02-03 08:44:19 0 176
Andhra Pradesh
క్రమశిక్షణ గల పార్టీ టిడిపి అని నిరూపితమైంది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
*క్రమశిక్షణ గల పార్టీ టీడీపీ అని నిరూపితమైంది* *హైబ్రీడ్‌ మహానాడును విజయవంతం చేసిన...
By Rajini Kumari 2026-05-30 12:06:07 0 164
Andhra Pradesh
ఆల్ ఇండియా పోలీస్ సౌజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
*ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం*   * మంగళగిరి...
By Rajini Kumari 2026-02-20 23:18:49 0 193
Telangana
జర్నలిస్ట్ సాంబా పై అక్రమ కేసులు ఎత్తివేయాలి : డీజీపీని కలిసిన టియుడబ్ల్యూజే నేతలు
 హైదరాబాద్:    ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ, ప్రజలకు వాస్తవాలను...
By Sidhu Maroju 2025-09-15 16:45:16 0 517
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com