మళ్లీ అవే సమాధానాలు.

0
142

 

మళ్లీ అవే సమాధానాలు

వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల భార్గవ్‌రెడ్డిని అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీసులు రెండోసారి విచారించారు. డీఎస్పీ పావని ఆధ్వర్యంలో బి.కొత్తకోట, ములకలచెరువు సీఐలు గోపాల్‌రెడ్డి, దస్తగిరి గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6:45 గంటల వరకూ స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 140 ప్రశ్నలు అడగగా.. అన్నింటికీ తెలీదు, గుర్తులేదు అని మళ్లీ పాత సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. సీఎం సతీమణి భువనేశ్వరి, హోం మంత్రి అనితలపై పెట్టిన అసభ్యకర పోస్టులకు సంబంధించి భార్గవ్‌రెడ్డిపై 2024లో బి.కొత్తకోటలో కేసు నమోదైంది. దీనిపై ఏప్రిల్‌ 26న విచారణకు హాజరైన భార్గవ్‌రెడ్డిని, అదే రోజు మదనపల్లెకు తీసుకొచ్చి విచారణ చేపట్టారు. 2022 నుంచి ఇప్పటి వరకూ ఎన్ని ఫోన్లు మార్చారు? ఎన్ని సిమ్‌లు ఉపయోగించారు? ఎన్ని సోషల్‌ మీడియా ఖాతాలు ఉపయోగించారు? అవి ఎవరివి? మీవేనా? లేక నకిలీ ఖాతాలా? జగతి పబ్లికేషన్‌కు, మీకూ ఏంటి సంబంధం? తదితర ప్రశ్నలు సంధించారు. వీటికి ఆయన తెలీదు.. ఏమో గుర్తు లేదు.. అనే సమాధానాలు చెప్పినట్లు తెలిసింది

Search
Categories
Read More
Telangana
అకాల వర్షాలు కన్నీళ్లు పెడుతున్న రైతులు....
అకాల వర్షాలు.. అన్నదాతకు కన్నీళ్లు.... భారత్ అవాజ్ న్యూస్ :TG: రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట...
By Gujile Ramu 2026-05-04 01:13:40 0 183
SURAKSHA
​. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రచారం
మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపేందుకు తెలంగాణ పోలీసులు నిన్న పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన...
By Kalaga Sailaja 2026-06-27 06:25:54 0 83
BMA
MIB 2026 Rules: Major Overhaul of Broadcast Regulation
The Ministry of Information and Broadcasting has just notified the draft Telecommunications...
By JoinBMA 2026-09-09 05:47:13 0 137
Telangana
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బర్రె మృతి
మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి పూర్రా విట్టల్ కి చెందిన బర్రె మృతి...
By Gandla Vaijanath 2026-07-04 05:15:34 0 256
Andhra Pradesh
ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి: బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.
బాపట్ల: ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్...
By Gadiyapudi Narendra 2026-01-23 16:00:44 0 253
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com