హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులపై కీలక అప్డేట్..!

0
198

హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో రెండో దశ విస్తరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో రెండో దశలోని ఏడు మార్గాలకు తక్షణమే అనుమతులు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ అంశంపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లారు. పీపీపీ మోడల్‌పై కేంద్రం గతంలో లేవనెత్తిన అభ్యంతరాలన్నీ ప్రాజెక్టు ప్రభుత్వ పరమవడంతో పరిష్కారమైనట్లు రాష్ట్రం భావిస్తోంది.

‎హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. మెట్రో మొదటి దశ ప్రాజెక్టులో ఎల్‌అండ్‌టీ సంస్థకు ఉన్న వంద శాతం షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ.. రెండో దశ పనులకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.

‎గతంలో మెట్రో రెండో దశ ప్రతిపాదనలకు సంబంధించి కేంద్రం కొన్ని సాంకేతిక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మొదటి దశ పీపీపీ యాజమాన్యంలో, రెండో దశ ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉండటం వల్ల ఆపరేషన్ పరంగా సమన్వయ లోపం వచ్చే అవకాశం ఉందని కేంద్రం మెలిక పెట్టింది. ఇప్పుడు మొదటి దశ కూడా ప్రభుత్వ పరమవడంతో ఆ అభ్యంతరాలు తొలగిపోయాయి. దీంతో రెండో దశ ఎ, బి భాగాల్లోని ఏడు మార్గాల సమగ్ర ప్రాజెక్టు నివేదికలను తక్షణమే

‎ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది

Search
Categories
Read More
BMA
Immersive Reporting: Slow Journalism in Rural India
Mainstream breaking news rarely spends more than a few hours covering rural issues before moving...
By JoinBMA 2026-08-24 06:07:02 0 133
Andhra Pradesh
వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రంగ కుమార్తె వంగవీటి ఆసకిరణ్
*విజయవాడ*:     వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రంగా కుమార్తె...
By Rajini Kumari 2025-12-26 10:01:04 0 234
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: పులిచెర్లపంటలను ధ్వంసం చేసిన ఏనుగు.
పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతున్నాయి. దేవళంపేట పంచాయతీలో మంగళవారం ఉదయం ఏనుగు...
By Kothuru Murali 2026-01-27 13:39:09 0 229
Andhra Pradesh
తోటవారిపాలెం పంట పొలాల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం,ఘటనా స్థలాన్ని సందర్శించిన డి.ఎస్.పి, పోలీసుల విచారణ
చీరాల: ఈరోజు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోటవారి పాలెం అంబేద్కర్ నగర్ జంక్షన సమీపంలో...
By Gadiyapudi Narendra 2026-02-02 13:18:03 0 284
Tripura
Transnational Syndicate Crushed: NCB Narcotics Bust
The Narcotics Control Bureau (NCB) dealt a massive blow to the illicit drug trade operating...
By Dunna Jessicaruth 2026-05-18 10:45:29 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com