మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల పరిహారం చెల్లించాలి : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి

0
233

మంచిర్యాల జిల్లాలో రైతుల మరణం ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి అన్నారు. లక్సెట్టిపేట మండలం గంపాలపల్లి, కొత్తూర్ గ్రామాల్లో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షం . కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం పై కవర్లు కప్పడానికి వెళ్లిన నలుగురు రైతులు గోడ కూలి మరణించారు. వారి మృతదేహాలను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లిన రఘనాథ్ రావు మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతుల కుంటుబాలకు ప్రభుత్వం ఒక్కక్కరికి తక్షణమే ₹ 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మిల్లర్లతో కుమ్మక్కయ్యారని అన్నారు. అందుకే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందన్నారు. వెంటనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
నగరంలోని మార్వాడి గల్లీలో మంచినీటి పైప్ లైన్ లీకేజీ కావడంతో కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్...
By Sadaq Sadaq 2026-05-21 12:58:04 0 125
Andhra Pradesh
నకిలీ ఆధార్ నమోదుపై కఠిన చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ హెచ్చరిక
నకిలీ ఆధార్ నమోదుపై కఠిన చర్యలు తప్పవు... జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్   హెచ్చరిక ...
By Chennaiah Kati 2026-06-17 14:00:26 0 104
Telangana
తెలంగాణలో పెరిగిన ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణలో పెరిగిన ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ తెలంగాణలో మార్చి రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు 40...
By Pinnehasan Odela 2026-03-06 06:38:45 0 252
Andhra Pradesh
కూటమి ప్రభుత్వంలో ప్రాణాంతకంగా మారిన పాలు
రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని...
By Boiena Rajesh 2026-02-28 11:45:17 0 231
Andhra Pradesh
మరో బి ఆర్ టి ఎస్ ఉద్యమం తప్పదు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జాబీర్
రాయచోటి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం వహించి రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన పన్నెండవ పిఆర్సి...
By Benguluri Madhubabu 2026-03-24 11:49:05 0 256
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com