7 కోట్ల 30 లక్షలతో నిర్మించబోతున్న గార్మెంటరీ యూనిట్‌కు గంగాపురి వద్ద మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన

0
331

ఉపాధి అవకాశాల విస్తరణకు తోడ్పడే విధంగా రూ. 7 కోట్లు 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే గార్మెంటరీ యూనిట్‌కు గంగాపురి వద్ద శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ గార్మెంటరీ యూనిట్ ద్వారా స్థానిక మహిళలు, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలు సృష్టించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ యూనిట్ స్థాపనతో మంథని పరిసర ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం కలుగుతుందని, ముఖ్యంగా మహిళా స్వయం ఉపాధి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
BMA
Media Mergers: Corporate Consolidation Cuts Vital Jobs
Massive corporate mergers in the broadcasting space are creating a severe redundancy crisis for...
By JoinBMA 2026-08-20 08:24:37 0 116
Andhra Pradesh
Boyakonda: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం ఆషాడ మాసం మొదటి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.
బోయకొండ: ఆషాడ మాసం మొదటి ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ...
By Pagadala Venkateswar 2026-07-20 11:30:33 0 115
Telangana
కోర్టులతో మొట్టికాయలు తినడమే పనిగా పెట్టుకున్న హైడ్రా
బతుకమ్మ కుంట భూమిపై స్టేటస్ కో ఉన్నాక ఎలా అభివృద్ధి చేస్తారని, బోర్డులు తొలగించాలని హైడ్రాను...
By Ponnala Srinivasrao 2026-04-28 02:17:13 0 164
Andhra Pradesh
చీరాల మండలం వెలుగు ఆఫీస్ నందు చీరాల మోడల్ హై స్కూల్ పక్కన డోక్రా సంఘాల యానిమేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్నాను.
చీరాల మండలం వెలుగు ఆఫీస్ నందు చీరాల మోడల్ హై స్కూల్ పక్కన డోక్రా సంఘాల యానిమేటర్ ఆధ్వర్యంలో...
By Gadiyapudi Narendra 2026-01-10 16:22:08 0 264
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com