సి ఎస్ ఎస్ నిధులు నూరు శాతం వినియోగించాలి గుంటూరు జిల్లా కలెక్టర్. ఏ తమిమ్ అన్సారియా

0
211

 *సీఎస్ఎస్ నిధులు నూరుశాతం వినియోగించాలి* గుంటూరు, డిసెంబర్ 23:-జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు (సీఎస్ఎస్) మంజూరు చేసిన నిధులు నూరుశాతం నిర్దేశించిన కాలపరిమితి లో వినియోగించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మంజూరు చేసిన నిధులు వినియోగం పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి, త్రాగునీరు,శానిటేషన్, విద్య, ఆరోగ్యం,పోషణ, మహిళ–బాలల అభివృద్ధి తదితర కార్యక్రమాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మంజూరు చేసిన నిధులు, వాటి ద్వారా నిర్వహిస్తున్న పనులపై అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శాఖల వారీగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన విధులు, వాటిలో వినియోగించిన నిధులు, మిగిలిన నిధుల వినియోగానికి కార్యాచరణ ప్రణాళికను సోమవారం నాటికి పూర్తిస్థాయి నివేదిక విభాగాధిపతులు అందించాలని సూచించారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏపిసీ పద్మావతి, డీఈఓ సలీం భాష, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, ఉద్యాన శాఖ అధికారి రవీంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డా. వై. ఎస్. ఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం
కర్నూలు !! డా.వైఎస్ఆర్ హార్టీకల్చర్ యూనివర్శిటీకి కొత్త వైస్-చాన్సలర్ నియామకంతాడేపల్లిగూడెం డా....
By Hari Krishna 2025-12-12 17:23:28 0 315
Telangana
ఆసిఫాబాద్ రూ.200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని అడ్డుకున్న రైతులు
భారత్ అవాజ్, కుమురం భీం ఆసిఫాబాద్ బ్యూరో:తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర...
By Chunarkar Jagadeesh 2026-07-04 11:09:39 0 181
Telangana
భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్?
కరీంనగర్ జిల్లా  *భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్...* కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం...
By Thalakokkula Sadanandam 2026-03-21 07:45:53 1 626
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ గంజాయి రహిత జిల్లా గా మారాలి ఎస్పీ శ్రీ వాకుల్ జిందల్, ఐపీస్ గారు.
గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 27.12.2025* _*//గంజాయి రహిత గుంటూరు జిల్లా లక్ష్యంగా చర్యలు....
By KOTESWARARAO KVSR 2025-12-27 10:13:22 0 250
Telangana
నిజామాబాద్. Mp అరవింద్ తో జైత్య పర్యాట న
ఎంపీ అరవింద్ తో  జగిత్యాల్ ప్రయాణంలో పలుగొన్న  జ్యోతి మురళీకృష్ణ9 వ డివిజన్...
By Sadaq Sadaq 2026-03-05 17:45:54 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com