"శ్రీగణేష్ ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్.|

0
276

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో ముందడుగు పడింది.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం మోండా డివిజన్ పరిధిలోని వెస్ట్ మారేడ్‌పల్లిలో సాయి సాత్విక్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్”ను అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా బలపరచడం కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు.

మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం అండగా నిలుస్తుందని, స్వయం ఉపాధి అవకాశాల ద్వారా మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దే దిశగా కృషి కొనసాగుతుందని తెలిపారు. కోటి మంది మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేసి కోటీశ్వరులుగా మార్చడమే ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

క్యాంటిన్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసిన మహిళా సంఘ సభ్యులను ఎమ్మెల్యే అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ప్రాంతాల్లో విస్తరించాలని ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో బోయిన్‌పల్లి సర్కిల్ డీసీ డాకూనాయక్, మెప్మా కోఆర్డినేటర్ యాదయ్య, అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుధాకర్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సంతోష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, వైష్ణవి యాదవ్, ధనలక్ష్మి, శేఖర్ ముదిరాజ్, శ్రీనాథ్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
గంగమ్మ జాతర లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: DSP.
సిటిఎం గంగమ్మ జాతర సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సోమవారం మదనపల్లి డీఎస్పీ మహేంద్ర...
By Pagadala Venkateswar 2026-02-03 06:20:09 0 178
Telangana
హిందూ స్మశాన వాటికలో చెత్త డంపింగ్ నిలిపివేయండి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  మచ్చ బొల్లారం పరిధిలోని సర్వే నెంబర్...
By Sidhu Maroju 2026-02-23 15:43:34 0 244
Andhra Pradesh
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భారీ స్థాయిలో పరిపాలన ప్రక్షాళన జరిగింది. పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐఎఫ్ఎస్...
By Pagadala Venkateswar 2026-08-08 05:34:50 0 92
Andhra Pradesh
బస్సును వెంబడించి ఆపిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దంటూ డ్రైవర్‌కు వార్నింగ్!
బస్టాప్‌లో ఆపకుండా వెళ్లిన ఆర్టీసీ బస్సు వెంబడించి అడ్డగించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె...
By Pagadala Venkateswar 2026-05-08 05:44:04 0 152
Bharat Aawaz
CJI Gavai Stresses Importance of Rights Awareness and Communal Harmony
New Delhi - Chief Justice of India (CJI) B.R. Gavai underscored the vital need for legal...
By Citizen Rights Council 2025-08-02 12:29:12 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com