విజయ్‌ని అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు.

0
129

తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన విజయ్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు

సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపిన ఏపీ సీఎం

విజయ్ అద్భుత విజయం సాధించారని కొనియాడిన చంద్రబాబు

తమిళ ప్రజలకు సేవ చేయడంలో విజయవంతం కావాలని ఆకాంక్ష

తమిళనాడులో 107 సీట్లతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరణ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన నటుడు విజయ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ ప్రభంజనం సృష్టించడంపై చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

 

ఈ సందర్భంగా విజయ్‌ని ప్రశంసిస్తూ చంద్రబాబు ఒక పోస్ట్ చేశారు. "తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు విజయ్‌కు నా అభినందనలు. తమిళనాడు ప్రజలకు సేవ చేయడంలో, వారి పురోగతి, శ్రేయస్సు కోసం మీరు చేసే ప్రయత్నాల్లో సంపూర్ణంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 107 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే అద్భుతమైన ఫలితాలు సాధించిన విజయ్‌కు పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాల్య వివాహాలు - చట్ట విరుద్ధం :విశాఖ అధికారులు వెల్లడి
బాల్య వివాహాలు అంటే 18 లేదా 21సంవత్స రములు రాక మునుపు చేస్తే వివాహాలను బాల్య వివాహాలు అంటారు. ఐతే...
By Mobbu Venkatramana 2026-02-25 14:08:18 0 295
Andhra Pradesh
మదనపల్లెలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.
మదనపల్లి రామారావు కాలనీలో సోమవారం పట్టపగలే రెండు వర్గాల యువకులు కర్రలు, రాళ్లతో నడిరోడ్డుపై...
By Pagadala Venkateswar 2026-03-10 04:26:27 0 172
Telangana
"కానాజిగూడలో జయంతి ఉత్సాహం… అంబేద్కర్‌కు ఘన గౌరవం.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన...
By Sidhu Maroju 2026-04-14 12:47:40 0 368
Andhra Pradesh
ఏపీలో ఇళ్ల నిర్మాణదారులకు ఊరట.. వీఎల్‌టీపై 50 శాతం రాయితీ.
ఏపీలో ఇళ్లు, భవనాలు నిర్మించే వారికి ప్రభుత్వం ఊరట ఖాళీ స్థలం పన్ను (వీఎల్‌టీ) 50 శాతం మేర...
By Pagadala Venkateswar 2026-04-22 03:08:49 0 134
Telangana
ఎన్యుమరేషన్‌పై ఇంటింటి పర్యటన.|
–రాజీవ్ వీకర్ సెక్షన్‌లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలన....
By Sidhu Maroju 2026-07-20 09:34:17 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com