ఏపీలో ఇళ్ల నిర్మాణదారులకు ఊరట.. వీఎల్‌టీపై 50 శాతం రాయితీ.

0
134

ఏపీలో ఇళ్లు, భవనాలు నిర్మించే వారికి ప్రభుత్వం ఊరట

ఖాళీ స్థలం పన్ను (వీఎల్‌టీ) 50 శాతం మేర తగ్గిస్తూ ఉత్తర్వులు

నిర్మాణ అనుమతి నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వరకు తగ్గింపు వర్తింపు

ఈ నిర్ణయంతో ప్రజలకు ఏటా రూ.30 కోట్ల వరకు లబ్ధి

అక్రమ నిర్మాణాలకు ఈ పన్ను తగ్గింపు వర్తించదని స్పష్టీకరణ

ఏపీలో ఇళ్లు, భవనాలు నిర్మించుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నిర్మాణ సమయంలో ఖాళీ స్థలాలపై విధించే పన్ను (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్-వీఎల్‌టీ)ను 50 శాతం తగ్గిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల పరిధిలో అనుమతి పొందిన అన్ని నిర్మాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఏటా ప్రజలపై పడే రూ.30 కోట్ల ఆర్థిక భారం తగ్గనుంది.

 

ఇళ్లు లేదా వాణిజ్య భవనాలు నిర్మించడానికి అన్ని రకాల అనుమతులు తీసుకున్నప్పటికీ, నిర్మాణ కాలంలో అధికారులు మళ్లీ ఖాళీ స్థలం పన్ను విధించడం ప్రజలకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలతో పాటు రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఈ పన్నును సగానికి తగ్గించాలని నిర్ణయించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం భవన నిర్మాణానికి అనుమతి పొందిన రోజు నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసే వరకు లేదా అనుమతి గడువు ముగిసే వరకు (వీటిలో ఏది ముందైతే అది) ఈ 50 శాతం పన్ను తగ్గింపు వర్తిస్తుంది. అయితే, ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టే అక్రమ నిర్మాణాలకు ఈ తగ్గింపు వర్తించదని ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది.

 

ఈ పన్ను తగ్గింపునకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదించింది. దానికి అనుగుణంగా ఇప్పుడు అధికారిక జీవోను విడుదల చేసింది. వాస్తవానికి వీఎల్‌టీ ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు ఏటా సుమారు రూ.60 కోట్ల ఆదాయం సమకూరేది. తాజా తగ్గింపుతో ఈ ఆదాయం రూ.30 కోట్లకు పరిమితం కానుంది. గతంలో 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ పన్నును తగ్గించాలని నిర్ణయించి జీవో ఇచ్చినా, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిని అమలు చేయలేదు. ఇప్పుడు మళ్లీ అదే నిర్ణయాన్ని అమలు చేస్తుండటంతో నిర్మాణ రంగంలో ఉన్న వారికి, సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి భారీ ప్రయోజనం చేకూరనుంది.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)
SIR ప్రక్రియలో భాగంగా 21వ డివిజన్‌లో నిర్వహించిన BLOలు, BLAల సమీక్ష సమావేశంలో ముఖ్య...
By Sadaq Sadaq 2026-07-25 14:13:14 0 151
Telangana
C M revanth reddy participated foundation stone
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ లో తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత, ప్రజాకవి...
By G k Nookala 2026-07-18 13:04:01 0 121
SURAKSHA
Shri K. V. Murali Krishna, IPS: A Quiet Guardian of Integrity and Public Service in Andhra Pradesh
From Dedicated Police Service to the Indian Police Service—A Journey Defined by Commitment,...
By Kalaga Sailaja 2026-07-14 07:23:30 0 255
Andhra Pradesh
ఆర్పీలకు రూ. 24 వేల జీతం ఇవ్వాలంటూ నిరసన.
మదనపల్లె కలెక్టరేట్ ఎదుట సోమవారం రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీలు) నిరసన ధర్నా చేపట్టారు. మున్సిపల్...
By Pagadala Venkateswar 2026-04-13 12:44:28 0 188
Sikkim
Sikkim Hydropower Projects Driving Green Energy Growth
Sikkim’s hydropower and energy projects continue to play a crucial role in the...
By Fathima Safa 2026-06-25 07:38:55 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com