"కేటీఆర్ మార్క్ రివ్యూ: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో భేటీ.|

0
326

హైదరాబాద్‌ : నంది నగర్ నివాసంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు మరియు నేతలతో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేయడం, త్వరలో ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు నూతన కమిటీల నిర్మాణం వంటి కీలక అంశాలపై ఆయన విస్తృతంగా చర్చించారు. 

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు.

ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో మంచి విజయాలు సాధించిన నేతలను అభినందించిన కేటీఆర్, అదే ఉత్సాహంతో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రజా సమస్యలపై గళమెత్తి పోరాడాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీ శక్తిని పెంపొందించేందుకు సమిష్టిగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు మరియు ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
BMA
River Guardians: Micro-Sensors Expose Illegal Effluents
Sacred rivers and local streams frequently suffer from clandestine industrial effluent dumping...
By JoinBMA 2026-08-22 07:58:22 0 160
Andhra Pradesh
పాము కాటుకు గురైన వృద్ధురాలు.. చికిత్స పొందుతూ మృతి
పాము కాటుకు గురైన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గంట్యాడలో జరిగింది.మండలంలోని...
By Boiena Rajesh 2026-05-27 14:00:46 0 263
Telangana
బాల్య వివాహం ఆపండి
గ్రామం మండలం: జర సంఘం విలేజ్ లో scop ngo. ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంలో బాల్య వివాహం నిషేధం అని...
By Alige Srinivas 2026-03-04 09:52:51 0 763
Andhra Pradesh
బహిరంగ మద్యం సేవించే ప్రాంతాలపై ప్రత్యేక చర్యలు... ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు
బహిరంగ మద్యం సేవించే ప్రాంతాలపై ప్రత్యేక చర్యలు... ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పిస్తున్న ప్రకాశం...
By Chennaiah Kati 2026-07-13 16:24:05 0 118
Chhattisgarh
Chhattisgarh Expands Water Conservation and Irrigation
Chhattisgarh continues to prioritize water conservation and irrigation by expanding irrigation...
By Fathima Safa 2026-07-01 09:12:56 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com