ఏపీలో హోటల్ ఫుడ్ ప్రియులకు షాక్.. 10 శాతం పెరగనున్న మెనూ ధరలు.

0
134

వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు

ఏపీ స్టార్ హోటళ్లలో 10 శాతం ధరల పెంపునకు నిర్ణయం

ప్రకటన చేసిన ఏపీ స్టార్ హోటళ్ల అసోసియేషన్

పెరిగిన ఖర్చులతో తప్పడం లేదన్న యాజమాన్యాలు

వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో ఆంధ్రప్రదేశ్‌లోని స్టార్ హోటళ్లలో భోజనం ప్రియం కానుంది. పెరిగిన ఖర్చుల భారాన్ని తట్టుకునేందుకు మెనూ ధరలను 10 శాతం వరకు పెంచాలని ఏపీ స్టార్ హోటళ్ల అసోసియేషన్ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ నిర్ణయం త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

 

అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 19 కేజీల వాణిజ్య సిలిండర్‌పై ఒకేసారి రూ.993 పెంచడం హోటల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన తెలిపారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో నష్టాలను ఎదుర్కొంటున్నామని, తాజా గ్యాస్ ధరల పెంపుతో నిర్వహణ మరింత కష్టంగా మారిందన్నారు.

 

ఈ పరిస్థితుల్లో హోటల్ పరిశ్రమను, దానిపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల ఉపాధిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని స్వామి పేర్కొన్నారు. అందుకే, గత్యంతరం లేని పరిస్థితుల్లో ధరలు పెంచాలనే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని వివరించారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
జన్ ధన్ యోజన పథకం.. దేశంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యం ప్రపంచంలో ఎక్కువ...
By Sadaq Sadaq 2026-06-01 14:21:41 0 158
Telangana
జననేత మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పతాకావిష్కరణ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : భారత 77వ గణతంత్ర వేడుకలు అల్వాల్ సర్కిల్ పరిధిలో...
By Sidhu Maroju 2026-01-26 12:37:20 0 240
Andhra Pradesh
పవన్ కళ్యాణ్ (ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి) తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్)పై విమర్శలు చేశారు.
పవన్ కళ్యాణ్ (ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి) తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్)పై విమర్శలు చేశారు....
By Bharat Aawaz 2025-05-27 05:53:21 0 3K
Andhra Pradesh
పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్.
మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాత్రికేయులకు అక్రిడిటేషన్...
By Pagadala Venkateswar 2026-02-25 08:27:32 0 201
SURAKSHA
K. K. Dwivedi: A Distinguished Career in Public Administration
A veteran Uttar Pradesh IAS officer whose decades of administrative service reflect dedication,...
By Kalaga Sailaja 2026-07-23 09:02:50 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com