అమరావతి చట్టబద్ధత బిల్లుపై హర్షం వ్యక్తం చేసిన ముస్లిం సోదరులు

0
266

*ప్రచురణార్థం*

02.04.26

 

_------------------------------

 

అమరావతికి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందటం పట్ల ముస్లిం మైనారిటీల హర్షం 

 

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు 

 

 *విజయవాడ:* 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ చట్టబద్ధత కోసం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం పట్ల ముస్లిం మైనారిటీలు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిడిపి మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో గణపతి రావు రోడ్డులోని ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి గురువారం సంబరాలు చేశారు. కేకు కోసి అమరావతికి చట్టబద్ధత కోసం కృషిచేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులైన మంత్రి నారా లోకేష్, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని)తో పాటుగా లోక్ సభ, రాజ్యసభ లోని కూటమి పార్టీల ఎంపీలకు ధన్యవాదాలు తెలిపారు. 

  జై అమరావతి.. జై చంద్రబాబు నాయుడు నాయకత్వం అంటూ నినాదాలు చేశారు. 

 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టిడిపి ముస్లిం మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా ముస్లిం మైనారిటీ సోదరుల ఆనందోత్సాహాల నడుమ కేకులు కోశారు. ఈ సందర్భంగా ఫతావుల్లా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతికి పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు పాస్ అవ్వడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతానికో లేదా ఒక కులానికో పరిమితమైనది కాదని, ఇది **అన్ని మతాలు, కులాలు మరియు వర్గాలకు చెందిన సార్వజనీన రాజధాని** అన్నారు. రాజధాని అమరావతికి లభించిన ఈ చట్టబద్ధత నవ్యాంధ్ర అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలవనుందనీ చెప్పారు.

అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) క్యాంప్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు.   

 

ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా రాజధాని ప్రాంతం ముఖ్యం అని అన్నారు. అమరావతి అభివృద్ధి చెందితేనే రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు .

 

 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం ఒక ప్రాంతీయ నాయకుడిగానే కాకుండా, పార్లమెంట్‌లో ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేయించడంలో తన రాజకీయ చతురతను, శక్తిని నిరూపించుకున్నారని అన్నారు.  

 

 దేశంలోని **11 ప్రముఖ రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా** అమరావతి బిల్లుకు బాహటంగా మద్దతు పలకడం విశేషం అని చెప్పారు. అమరావతిని ఒక శక్తిగా తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రజలు కొనియాడుతున్నారన్నారు. 

 

 

గత వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వం అమరావతిని "స్మశానం" అని, "మునిగిపోయే ప్రాంతం" అని విమర్శిస్తూ అభివృద్ధిని అడ్డుకుందని ఫతావుల్లా గుర్తు చేశారు. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న అమరావతిని నిర్వీర్యం చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని, అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయని అన్నారు. రాజధాని ఉంటేనే పారిశ్రామిక ప్రగతి ఉంటుందన్నారు. 

హైదరాబాద్ (తెలంగాణ), ముంబై (మహారాష్ట్ర), అహ్మదాబాద్ (గుజరాత్) వంటి నగరాలు రాజధానులుగా ఉంటేనే ఆయా రాష్ట్రాలకు పరిశ్రమలు, వ్యాపారాలు తరలివచ్చాయని, అదే బాటలో అమరావతి అభివృద్ధి చెందితేనే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా పుంజుకుంటుందని తెలిపారు.   

 

రాజధాని అమరావతి విషయంలో ఇప్పటికి కూడా వైసిపి వైఖరి ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే ఈ బిల్లును పార్లమెంట్‌లో **వైఎస్ఆర్‌సిపి వ్యతిరేకించడంపై** ప్రజలంతా అసహ్యించుకుంటున్నారన్నారు. వైసిపి , ఆ పార్టీ అధినేత జగన్ సైకో వైఖరి వల్లే ప్రజలు గత ఎన్నికల్లో ఆ పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. అయినా జగన్ మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రాలేదని, ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో రాజధాని వ్యతిరేకులను ప్రజలు తరిమికొడతారని వారు హెచ్చరించారు . ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన వైఖరి మార్చుకోకపోతే అంకుశం సినిమాలో విలన్ రామిరెడ్డిని తరిమికొట్టినట్లుగా అమరావతి విలన్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలంతా ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొడతారన్నారు. వైసీపీని రాష్ట్రంలో స్థాపితం చేయటం తథ్యం అన్నారు. 

 

ఈ కార్యక్రమంలో... పశ్చిమ నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అన్సర్, ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, ఉపాధ్యక్షులు ఎస్ డి ఆలీ, క్లస్టర్ ఇంచార్జి కరీముల్లా, అధికార ప్రతినిధి అబ్దుల్ బారీ, 45 వ డివిజన్ కార్యదర్శి షేక్ సుభాని, 56వ డివిజన్ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్ల కి కనీసవేతనాలు అమలుచేయాలి..
బాపట్ల: అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్ల కి కనీసవేతనాలు అమలుచేయాలి, దేశవ్యాప్తంగా బడ్జెట్ పెంపుదల...
By Gadiyapudi Narendra 2026-02-03 16:04:03 0 403
Telangana
"ఆగస్టు 2న ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. తలసానికి ఆహ్వాన పత్రం అందజేత. "|
సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఈ...
By Sidhu Maroju 2026-06-16 08:14:54 0 218
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్క్క:పై కొడవలితో దాడి తమ్ముడు అరెస్ట్
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామపంచాయతీ బోయకొండ యానాదిపాలెంలో బుధవారం దారుణ...
By Kothuru Murali 2026-02-12 05:38:57 0 217
Andhra Pradesh
పుంగనూరు: హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు మృతి
సదుం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గిరిబాబు (48) అనారోగ్యంతో శనివారం...
By Kothuru Murali 2026-04-26 10:45:51 0 157
Andhra Pradesh
కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
*కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు*   •...
By Rajini Kumari 2026-01-22 12:10:16 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com