రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేశ్ పై జరిగిన దాడి అత్యంత అమానుషమని చీరాల తెలుగు యువత అధ్యక్షుడు దోగుపర్తి బాలకృష్ణ మండిపడ్డారు.

0
293

 గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.రాజకీయాల్లో విభేదాలు ఉండటం సహజమని, అయితే వాటిని హింస ద్వారా వ్యక్తపరచడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలనిఎలాంటి అసంతృప్తి ఉన్నా ఓటు ద్వారానే సమాధానం చెప్పాలి తప్ప, భౌతిక దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.దాడులు, బెదిరింపులు వంటి హింసాత్మక చర్యలు రాజకీయ సంస్కృతికి మచ్చ తెస్తాయని, ఇటువంటి ఘటనలు సమాజంలో అశాంతికి దారితీస్తాయని ఆయన హెచ్చరించారు.భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని దోగుపర్తి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

దుండి రాకేశ్‌పై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధం. 

అసంతృప్తి ఉంటే ఓటు ద్వారా చూపాలి, హింస ద్వారా కాదు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

రాజకీయాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని దోగిపర్తి బాలకృష్ణ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలో వకుళ మాత ఆలయంలో అక్షరాభ్యాసం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలో వకుళ మాత ఆలయంలో అక్షరాభ్యాసం -...
By Chennaiah Kati 2026-07-03 17:04:34 0 103
Telangana
కార్మికులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి : దుంపల రంజిత్
మంచిర్యాల జిల్లా : సీఐటీయు జిల్లా కమిటీ సమావేశం బుధవారం రోజున బెల్లంపల్లి సీఐటీయు కార్యాలయం...
By Avunoori Mahesh 2026-09-02 13:46:40 0 184
Telangana
ఏది నిజం ?
బండి భగీరధ్ ను పేట్‌బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన పోలీసులు. భగీరధ్ స్వయంగా...
By Ponnala Srinivasrao 2026-05-17 01:56:25 0 156
Andhra Pradesh
దోర్నాల పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమలకు యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు శంకుస్థాపనలు ప్రారంభించారు ప్రారంభాలు చేశారు ఈ సందర్భంగా ఈ క్రింద తెలిపిన కార్యక్రమంలో పాల్గొన్నారు
దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు యర్రగొండపాలెం నియోజకవర్గ...
By Chennaiah Kati 2026-01-11 13:15:04 0 319
Telangana
కురుకురే లో టాయ్ బాల్ మింగి చిన్నారి మృతి
పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెప్పే ఘటన ఇది. కురుకురే ప్యాకెట్ ఐదేళ్ల బాలుడి...
By Sunka Santhosh 2026-08-02 18:17:35 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com